సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

సరదా.. సరదాగా సాగిపోయే Veetla Visesham

ABN, First Publish Date - 2022-06-05T17:20:02+05:30

బాలీవుడ్‌లో విజయవంతమైన ‘బదాయి హో’ (Badayi ho ) చిత్రాన్ని తమిళంలోకి ‘వీట్ల విశేషం’ (Veetla Visesham) పేరుతో రీమేక్ చేశారు. జీ స్టూడియోస్ తో కలిసి బే వ్యూస్‌ ప్రొడక్షన్‌ బ్యానరుపై బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ (Boney kapoor) నిర్మించారు. సీనియర్‌ నటుడు సత్యరాజ్ (Satyaraj)‌, నటి ఊర్వశి (Urvasi) ప్రధాన పాత్రలు పోషించారు. మరో కీలక పాత్రలో ఆర్‌.జె. బాలాజి (Rj Balaji) నటించగా, మలయాళ బ్యూటీ అపర్ణా బాలమురళి (Aparna Balamurali) హీరోయిన్‌ గా నటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌లో విజయవంతమైన ‘బదాయి హో’ (Badayi ho ) చిత్రాన్ని తమిళంలోకి ‘వీట్ల విశేషం’ (Veetla Visesham) పేరుతో రీమేక్ చేశారు. జీ స్టూడియోస్ తో కలిసి బే వ్యూస్‌ ప్రొడక్షన్‌ బ్యానరుపై బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ (Boney kapoor) నిర్మించారు. సీనియర్‌ నటుడు సత్యరాజ్ (Satyaraj)‌, నటి ఊర్వశి (Urvasi) ప్రధాన పాత్రలు పోషించారు. మరో కీలక పాత్రలో ఆర్‌.జె. బాలాజి (Rj Balaji) నటించగా, మలయాళ బ్యూటీ అపర్ణా బాలమురళి (Aparna Balamurali) హీరోయిన్‌ గా నటించింది. ఈ నెల 17వ తేదీన ఈ చిత్రం విడుదలకానుంది.  తమిళ నేటివిటీకి అనుగుణంగా మలిచేందుకు ఐదు నెలల పాటు స్ర్కిప్టుపై ఎన్‌జె.శరవణన్‌తో కలిసి ఆర్‌.జె.బాలాజి పనిచేసి, వీరిద్దరూ కలిసి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం వివరాలను ఆర్‌.జె.బాలాజి విలేకరులకు వివరించారు.


‘ఈ సినిమాలో ఉన్నట్టుగానే నా నిజ జీవితంలో జరిగింది. నేను కాలేజీలో చేరే సమయంలో మా అమ్మ గర్భం దాల్చింది. ఈ చిత్రాన్ని తమిళంలోకి రీమేక్‌ చేయాలని నిర్మాత బోనీ కపూర్‌ కోరినప్పుడు మరో మాట చెప్పకుండా సమ్మతించాను. ఈ స్టోరీ చాలా సరదా సరదాగా సాగిపోతుంది. చాలామంది రియల్‌ లైఫ్‌లో ఇందులోని అంశాలు ఎదురై వుంటాయి. అయితే, బాలీవుడ్‌లో ఉన్నట్టుగానే రీమేక్‌ చేయకుండా మన ఆడియన్స్‌కు నచ్చేలా ముఖ్యంగా కోయంబత్తూరు యాసలో తెరకెక్కించాం. ఈ స్ర్కిప్టు వర్క్‌ కోసమే ఐదు నెలల పాటు పనిచేశాం. ఒక విధంగా చెప్పాలంటే ఇది రీమేక్‌ కాదు. హిందీ చిత్ర కథాంశాన్ని తీసుకుని మనకు నచ్చేలా, ఫ్రేమ్‌ బై ఫ్రేమ్‌ ఎంజాయ్‌ చేసేలా రూపొందించాం. ఈ స్టోరీని అనుకున్నప్పుడు ప్రధాన పాత్రలకు ఊర్వశి, సత్యరాజ్‌ అని మా మనస్సులో ఫిక్స్‌ అయిపోయాం. ఆ తర్వాత సత్యరాజ్‌, ఊర్వశిలను సంప్రదించగా వారు మరో మాట చెప్పకుండా ఓకే చెప్పేశారు.  అపర్ణా బాలకృష్ణన్‌ పాత్ర చాలా బాగా వచ్చింది. సెట్స్‌లో చాలా సరదాగా సాగిపోయింది. చాలా సంవత్సరాల తర్వాత ఊర్వశి, సత్యరాజ్‌ ఒకే ఫ్రేమ్‌లో భార్యాభర్తలుగా కనిపించనున్నారు. అలాంటి పెద్ద స్టార్స్‌ను డైరెక్ట్‌ చేయడం చాలా సంతోషంగా ఉంది’ అని ఆర్‌జే.బాలాజి వివరించారు. కాగా, ఈ చిత్రానికి కెమెరా కార్తీక్‌ ముత్తుకుమార్ (Karthik muthukumar)‌, ఎడిటింగ్‌ సెల్వ ఆర్‌కె (Selva Rk), సంగీతం గిరీష్‌ గోపాకృష్ణన్ (Girish Gopalakrishnan)‌, కొరియోగ్రఫీ దినేష్‌. రోమియో పిక్చర్స్‌ (Romeo Pictures)  తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ మూవీని రిలీజ్‌ చేయనుంది. 

Updated Date - 2022-06-05T17:20:02+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!