సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Varsha Bollamma: నేత్రదానం..

ABN, First Publish Date - 2022-05-04T19:03:58+05:30

తమిళం, తెలుగు, మలయాళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది యంగ్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ (Varsha Bollamma). ఈమె తన నేత్రాలను దానం చేసేందుకు అంగీకరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తమిళం, తెలుగు, మలయాళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది యంగ్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ (Varsha Bollamma). ఈమె తన నేత్రాలను దానం చేసేందుకు అంగీకరించారు. ఈ విషయం తెలిసిన అభిమానులు ఆమెను ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. ‘చదురన్‌’ అనే చిత్రం ద్వారా కోలీవుడ్‌లోకి అడుగుపెట్టిన వర్ష... ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా తమిళ స్టార్ విజయ్‌ (Vijay) - దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో వచ్చిన ‘బిగిల్‌’ చిత్రంలో ఫుట్‌బాల్‌ క్రీడాకారిణి సింగపెణ్‌గా నటించగా, ఈ పాత్ర ఆమెకు మంచి పేరుతోపాటు గుర్తింపును తెచ్చిపెట్టింది. అదే విధంగా విజయ్‌ (Vijay) - విజయ్‌ సేతుపతి కలిసి నటించిన ‘మాస్టర్‌’ చిత్రంలోనూ కాలేజీ విద్యార్థినిగా నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఇలా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న వర్ష బొల్లమ్మ (Varsha Bollamma)... ఇపుడు తన నేత్రాలను దానం చేసి ప్రతి ఒక్కరి నుంచి అభినందనలు పొందుతున్నారు. 

Updated Date - 2022-05-04T19:03:58+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!