Valimai సూపర్ హిట్ : హ్యూమా ఖురేషి 100 కోట్ల ఆనందం!
ABN , First Publish Date - 2022-02-28T04:16:29+05:30 IST
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన ‘వలిమై’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల మార్కుని దాటేసింది. విడుదలైన మూడు రోజుల్లోనే తమిళ యాక్షన్ థ్రిల్లర్ అన్ని చోట్లా కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే, ‘వలిమై’లో సొఫియా పాత్రలో కీలకంగా నటించిన బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషి...

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన ‘వలిమై’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల మార్కుని దాటేసింది. విడుదలైన మూడు రోజుల్లోనే తమిళ యాక్షన్ థ్రిల్లర్ అన్ని చోట్లా కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే, ‘వలిమై’లో సొఫియా పాత్రలో కీలకంగా నటించిన బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషి తమ చిత్రం బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల మైలురాయిని దాటినందుకు సంతోషం వ్యక్తం చేసింది. ట్విట్టర్లో ‘‘Woo hoo! థాంక్యూ ఆల్ ఫర్ ద లవ్’’ అంటూ ఆమె ఓ పోస్ట్ షేర్ చేసింది. ‘వలిమై’ సినిమా అజిత్ హీరోగా బోనీ కపూర్ నిర్మించారు. హెచ్. వినోద్ దర్శకత్వం వహించారు. అజిత్, బోనీ, వినోద్ కాంబినేషన్లోనే గతంలో ‘నెర్కొండ పార్వై’ సినిమా మంచి సక్సెస్ సాధించింది. ఇప్పుడు ‘వలిమై’తో రెండో ఘన విజయం ఖాతాలో వేసుకున్నారు...