Vadhandhi: ఓటీటీలో దూసుకెళుతున్న ‘వదంతి’.. ఆ పాత్రకి ప్రశంసలు

ABN , First Publish Date - 2022-12-05T14:44:08+05:30 IST

దర్శకుడు ఆండ్రూ లూయిస్‌ (Andrew Louis) కథ సమకూర్చి దర్శకత్వం వహించిన వెబ్‌ సిరీస్‌ ‘వదంతి - ది ఫేబుల్‌ ఆఫ్‌ వెలోని’..

Vadhandhi: ఓటీటీలో దూసుకెళుతున్న ‘వదంతి’.. ఆ పాత్రకి ప్రశంసలు

దర్శకుడు ఆండ్రూ లూయిస్‌ (Andrew Louis) కథ సమకూర్చి దర్శకత్వం వహించిన వెబ్‌ సిరీస్‌ ‘వదంతి - ది ఫేబుల్‌ ఆఫ్‌ వెలోని’ (Vadhandhi: The Fable of Velonie). 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది. దర్శక నటుడు ఎస్‌.జె.సూర్య (S. J. Surya) ప్రధాన పాత్ర  పోషించారు. ‘పుకార్లు, అబద్ధాలు, మోసాల వలయంలో చిక్కుకున్నప్పటికీ తన విధి నిర్వహణలో ఏమాత్రం ఏకాగ్రత కోల్పోని పోలీస్‌ అధికారిగా ఎస్‌.జె.సూర్య నటించిన పాత్రకు ప్రేక్షకులతో పాటు సినీ క్రిటిక్స్‌ నుంచి ప్రశంసలు వస్తున్నాయి. మొత్తం ఎనిమిది ఎపిసోడ్లుగా రూపొందించిన ఈ వెబ్‌సిరీస్‌ను ఇన్వెస్టిగేషన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ జానర్‌లో తెరకెక్కించారు.


తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్‌ చేశారు. పదేళ్ల క్రితం వెండితెరపై ఆలరించిన హీరోయిన్‌ లైలా (Laila) ఈ వెబ్‌ సిరీస్‌ ద్వారా మరోమారు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎస్‌.జె.సూర్యకు కూడా ఇదే తొలి వెబ్‌సిరీస్‌ కావడం గమనార్హం. పుష్కర్‌ - గాయత్రి (Pushkar - Gayatri) కథను సమకూర్చారు. కన్యాకుమారిలో నివసించే ఒక ఆంగ్లో ఇండియన్‌ కుటుంబానికి చెందిన కథ. లైలా తల్లిపాత్రలోనూ, ఆమె కుమార్తె వెలోనీగా సంజన నటించారు. ఇందులో వెలోనీ అనుమానాస్పద రీతిలో చనిపోతుంది. దీని వెనుక ఉన్న కారాణాలపై ఇన్వెస్టిగేషన్‌ జానర్‌లో ఈ వెబ్‌సిరీస్‌ సాగుతుంది. 



Updated Date - 2022-12-05T14:44:08+05:30 IST