సినిమా రైట్స్‌ తీసుకునే ముందు డాడీని సంప్రదించా: Udhayanidhi Stalin

ABN , First Publish Date - 2022-05-12T05:04:32+05:30 IST

బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ (Boney Kapoor)కు చెందిన బేవ్యూ ప్రాజెక్టు పతాకంపై జీస్టూడియోస్‌, రోమియో పిక్చర్స్‌ సహకారంతో నిర్మించిన చిత్రం ‘నెంజుక్కు నీతి’ (Nenjukku Neethi). ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) హీరోగా నటించిన ఈ చిత్రంలో శివానీ రాజశేఖర్‌

సినిమా రైట్స్‌ తీసుకునే ముందు డాడీని సంప్రదించా: Udhayanidhi Stalin

బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ (Boney Kapoor)కు చెందిన బేవ్యూ ప్రాజెక్టు పతాకంపై జీస్టూడియోస్‌, రోమియో పిక్చర్స్‌ సహకారంతో నిర్మించిన చిత్రం ‘నెంజుక్కు నీతి’ (Nenjukku Neethi). ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) హీరోగా నటించిన ఈ చిత్రంలో శివానీ రాజశేఖర్‌ (Shivani Rajasekhar), తాన్య రవిచంద్రన్‌లు (Tanya Ravichandran) హీరోయిన్లు. అరుణ్‌రాజా కామరాజ్‌ (Arun Raja Kamaraj) దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఆడియో, ట్రైలర్‌ విడుదల కార్యక్రమాన్ని తాజాగా చెన్నైలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బడా నిర్మాతలు టీజీ త్యాగరాజన్‌, అన్బుచెళియన్‌, దర్శకుడు అన్బుతిరుమేని, నటుడు ఆర్‌జే బాలాజీ, హీరో శివకార్తికేయన్‌, పాఠశాల విద్యాశాఖామంత్రి అన్బిల్‌ మహేష్‌, చిత్ర నిర్మాత బోనీ కపూర్‌ తదితరులు పాల్గొన్నారు. 


ఈ సందర్భంగా హీరో ఉదయనిధి మాట్లాడుతూ.. ‘‘హిందీలో విజయవంతమైన ‘ఆర్టికల్‌ 15’ రైట్స్‌ తీసుకుని తమిళంలోకి రీమేక్‌ చేస్తానని మా నాన్న(MK Stalin)కు చెప్పినపుడు చూసి.. జాగ్రత్తగా చేసుకోమన్నారు. ఈ చిత్ర టైటిల్‌కు న్యాయం చేశామని భావిస్తున్నాము. ఈ చిత్ర విజయం కరోనా మహమ్మారికి ప్రాణాలు కోల్పోయిన దర్శకుడు, అరుణ్‌రాజా కామరాజ్‌, మరికొందరికి అంకితం’’ అని వెల్లడించారు. 


నిర్మాత బోనీ కపూర్‌ మాట్లాడుతూ.. ‘హిందీలో ఈ చిత్రాన్ని చాలా సార్లు చూశాను. ‘ఆర్టికల్‌ 15’ కంటే తమిళంలో దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు’ అని తెలపగా.. హీరో శివకార్తికేయన్‌ మాట్లాడుతూ.. ‘‘ఉదయనిధి ఎన్నో పనులు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. నిజం చెప్పాలంటే ఆయనే నిజమైన ‘డాన్‌’. ఇన్నేళ్ళ పరిచయంలో ఆయన నుంచి పాజిటివ్‌ అంశాలనే నేర్చుకున్నాను. అరుణ్‌రాజా కష్టాల్లో ఉన్నపుడు ఆయనకు అండగా ఉదయనిధి ఉన్నారు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి’’ అని అన్నారు. 


నిర్మాత త్యాగరాజన్‌ మాట్లాడుతూ.. ‘‘సరైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇందులో పోలీస్‌ పాత్ర చాలా బాగా వచ్చింది. చిత్ర బృందానికి ధన్యవాదాలు’’ అని తెలపగా.. మరో నిర్మాత అన్బుచెళియన్‌ మాట్లాడుతూ.. ‘‘ఒక ఇటుకతో రాష్ట్రంలో అధికారాన్ని మార్చిన వ్యక్తి ఉదయనిధి. ఆయన కెరీర్‌లో మంచి చిత్రంగా నిలుస్తుంది’’ అని అన్నారు. అలాగే, హీరోయిన్లు శివానీ రాజశేఖర్‌, తాన్య రవిచంద్రన్‌, నటుడు ఆర్‌జే బాలాజీ, దర్శకుడు అరుణ్‌రాజా కామరాజ్‌, సంగీత దర్శకుడు దిబు నినన్‌ తదితరులు ప్రసంగించారు. ఈ చిత్రం ఈ నెల 20వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది.

Updated Date - 2022-05-12T05:04:32+05:30 IST

Read more