సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Kamal Haasan నిర్మాతగా ఉదయనిధి కొత్త చిత్రం

ABN, First Publish Date - 2022-07-27T22:05:56+05:30

ఇటీవల ‘విక్రమ్’ చిత్రంతో లోకనాయకుడు కమల్ హాసన్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్‌తో విరుచుకుపడింది ఈ సినిమా. చాన్నాళ్ళ తర్వాత కమల్ నుంచి ఈ స్థాయిలో ఘన విజయం రావడంతో అభిమానులు ఆనంద పట్టలేకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇటీవల ‘విక్రమ్’ (Vikram) చిత్రంతో లోకనాయకుడు కమల్‌హాసన్ (Kamal Haasan) బిగ్గెస్ట్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్‌తో విరుచుకుపడింది ఈ సినిమా. చాన్నాళ్ళ తర్వాత కమల్ నుంచి ఈ స్థాయిలో ఘన విజయం రావడంతో అభిమానులు ఆనంద పట్టలేకున్నారు. ప్రస్తుతం కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ (Indian 2) చిత్రాన్ని తిరిగి పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. అలాగే.. హీరోగా పలు చిత్రాల్ని లైన్ లో పెట్టుకున్నారు. త్వరలో కమల్ నుంచి ఓ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ రానున్నదని సమాచారం. 


ఇదిలా ఉంటే..కమల్‌హాసన్‌ తన సొంత నిర్మాణ సంస్థ రాజ్‌కమల్‌ ఫిలిమ్స్‌ ఇంటర్నేషనల్‌ బ్యానరుపై తాను హీరోగా మాత్రమే కాకుండా, ఇతర హీరోలతో కూడా చిత్రాలు నిర్మిస్తున్నారు. ఇప్పటికే శివకార్తికేయన్‌ (Shiva Karthikeyan) హీరోగా రాజ్‌కుమార్‌ పెరియస్వామి (Rajkumar Peryaswamy) దర్శకత్వంలో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇపుడు మరో చిత్రాన్ని ప్రకటించారు. నిర్మాత, హీరో, రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ అధినేత, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ (Udayanidhi Stalin) హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించనున్నట్టు తాజాగా ప్రకటించారు. ఆదివారం రాత్రి నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇదేవిషయాన్ని ఉదయనిధి కూడా తన ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ‘రాజ్‌కమల్‌ ఫిలిమ్స్‌ ఇంటర్నేషనల్‌ బ్యానరులో హీరోగా నటించే అవకాశం దక్కింది. ఈ ప్రకటన చేసిన హీరో కమల్‌కు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.

Updated Date - 2022-07-27T22:05:56+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!