ఆండ్రియాకు యూఏఈ గోల్డెన్‌ వీసా..

ABN , First Publish Date - 2022-03-25T20:11:32+05:30 IST

తమిళ చిత్రపరిశ్రమలో బోల్డ్‌ క్యారెక్టర్లలో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న ఆండ్రియా ప్రస్తుతం మిష్కిన్‌ దర్శకత్వంలో ‘పిశాచు-2’ చిత్రంలో నటిస్తోంది.

ఆండ్రియాకు యూఏఈ గోల్డెన్‌ వీసా..

తమిళ చిత్రపరిశ్రమలో బోల్డ్‌ క్యారెక్టర్లలో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న ఆండ్రియా జెరెమియా ప్రస్తుతం మిష్కిన్‌ దర్శకత్వంలో ‘పిశాచు-2’ చిత్రంలో నటిస్తోంది. ఇదిలావుంటే, ఆండ్రియాకు గోల్డెన్‌ వీసా లభించింది. యునెటైడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) ప్రభుత్వం అనేక మంది భారతీయ సినీ సెలెబ్రిటీలకు ఈ వీసా అందజేస్తోంది. ఈ జాబితాలో ఇపుడు ఆండ్రియా కూడా చేరింది.. ఈమెకు పదేళ్ళ కాలపరిమితి కలిగిన గోల్డెన్‌ వీసాను యూఏసీ ప్రభుత్వం అందజేసింది. దీంతో అరబ్‌ ఎమిరేట్స్‌ ప్రభుత్వానికి ఆమె ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.  కాగా, ఇటీవలే ఈ వీసాను సీనియర్ హీరోయిన్ మీనా అందుకున్నారు. 


ఇక తొలిసారి యాక్షన్‌ హీరోయిన్‌గా ఓ సినిమాను చేస్తుంది ఆండ్రియా. అటవీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సరికొత్త పాత్రలో నటిస్తోంది. షాలోమ్‌ స్టూడియోస్‌ పతాకంపై జాన్‌మ్యాక్స్‌ సమర్పణలో నాంజిల్‌ దర్శకత్వం వహించిన చిత్రానికి ‘కా’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. ఆండ్రియా ఇందులో వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌గా కనిపించబోతోంది.   

Updated Date - 2022-03-25T20:11:32+05:30 IST