Karthi ట్వీట్‌కు రిప్లై ఇస్తూ తెలివైన వారికి ప్రవేశం లేదంటున్న Trisha
ABN , First Publish Date - 2022-07-08T02:10:00+05:30 IST
స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘పొన్నియన్ సెల్వన్ 1’ (Ponniyin Selvan 1). లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. ప్రసిద్ధ రచయిత కల్కి రాసిన
స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘పొన్నియన్ సెల్వన్ 1’ (Ponniyin Selvan 1). లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. ప్రసిద్ధ రచయిత కల్కి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ నవల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఈ మూవీని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తొలి భాగాన్ని సెప్టెంబర్ 30న విడుదల చేయనున్నారు. విడుదల తేది దగ్గర పడటంతో చిత్ర బృందం ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. అందులో భాగంగా కీలక నటీనటుల ఫస్ట్‌లుక్‌లను విడుదల చేయడం మొదలుపెట్టింది.
కార్తి (Karthi), త్రిష (Trisha) మొదటి సారిగా ‘పొన్నియల్ సెల్వన్’ లో నటిస్తున్నారు. ఆదిత్య కరికాలన్ (Aditya Karikalan)గా విక్రమ్, నందినిగా ఐశ్వర్య రాయ్, వంథియ దేవన్(Vanthiyathevan)గా కార్తి కనిపించనున్నారు. కుందవాయి (Kundavai)గా త్రిష నటించనుంది. తన లుక్కు సంబంధించిన పోస్టర్‌ను త్రిష సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ‘‘పురుష ప్రపంచంలో ధీర వనిత. రాణి కుందవాయి’’ అని త్రిష రాసింది. అందుకు కార్తి సరదాగా స్పందించాడు. ‘‘రాణి లైవ్ లోకేషన్ పంపించండి. మీ సోదరుడికి ఓ సందేశాన్ని పంపించాలి’’ అని కార్తి కామెంట్ చేస్తూ త్రిషను ట్యాగ్ చేశాడు. అందుకు త్రిష రిప్లై ఇచ్చింది. ‘‘ప్యాలెస్‌లో స్మార్ట్ ఫోన్స్‌కు, తెలివైన వారికి ప్రవేశం లేదు’’ అని ఆమె స్పందించింది. ‘పొన్నియన్ సెల్వన్’ టీజర్‌ను తంజావురూలోని ప్రఖ్యాత బృహదీశ్వరాలయంలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ చిత్రంలో జయం రవి (Jayam Ravi), జయరాం (Jayaram), ప్రకాష్ రాజ్ (Prakash Raj), ప్రభు (Prabhu), శరత్ కుమార్, పార్తీబన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఏఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఎడిటింగ్ బాధ్యతలను శ్రీకర్ ప్రసాద్ నిర్వహిస్తున్నాడు. ప్రొడక్షన్ డిజైనర్‌గా తోట తరణి పనిచేస్తున్నాడు. ‘పొన్నియన్ సెల్వన్ -2’ ను వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల చేయనున్నారు.