Pinocchio: చెక్క బొమ్మకి ప్రాణం వస్తే.. ఆకట్టుకుంటున్న టీజర్ ట్రైలర్..

ABN , First Publish Date - 2022-06-01T17:46:41+05:30 IST

వాల్ట్ డిస్నీ స్టూడియోస్ తాజాగా టామ్ హాంక్స్ నటించిన పినోకియో (Pinocchio) టీజర్ ట్రైలర్‌ను విడుదల చేసింది..

Pinocchio: చెక్క బొమ్మకి ప్రాణం వస్తే.. ఆకట్టుకుంటున్న టీజర్ ట్రైలర్..

వాల్ట్ డిస్నీ స్టూడియోస్ తాజాగా టామ్ హాంక్స్ నటించిన పినోకియో (Pinocchio) టీజర్ ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ లైవ్ యాక్షన్ మూవీ కుటుంబ ప్రేక్షకులను అలరించేలా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఓ వ్యక్తి చెక్క బొమ్మని తయారు చేస్తాడు. దాన్నే కొడుకుగా భావిస్తుంటాడు. అనుకోకుండా ఆ బొమ్మకి ప్రాణం వస్తుంది. అనంతరం అది కొన్ని సాహసాలు చేస్తూ చివరికీ నిజమైన మనిషిగా మారుతుంది. ఇలాంటి వినూత్న కథతో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 8న ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney+ Hotstar)లో విడుదల కానుంది. 


తాజాగా విడుదలైన ఈ చిత్ర టీజర్ ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా 1940లో వచ్చిన డిస్నీ యానిమేటెడ్ మూవీ ఆధారంగా తెరకెక్కింది. యానిమేటేడ్ సినిమాలంటే ఇష్టపడేవారికీ ఈ మూవీ గురించి తెలిసే ఉంటుంది. అయితే ఈ ట్రైలర్‌లో మాత్రం ఆ పాత సినిమాని ఎంతవరకు అనుసరించారో తెలియకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అప్పట్లో ఆ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసుకోగా.. ఈ మూవీ ఎంతవరకు మూవీ లవర్స్‌ని ఆకట్టుకుంటుందో చూడాలి.



Updated Date - 2022-06-01T17:46:41+05:30 IST