శ్రీలంకకు దక్షిణ భారత నటీమణులు, ప్రముఖులు

ABN , First Publish Date - 2022-04-03T23:36:34+05:30 IST

శ్రీలంకకు దక్షిణ భారత నటీమణులు, ప్రముఖులు తరలిపోతున్నారు. అక్కడ ఫ్యాషన్ షూట్‌లు నిర్వహించేందుకు ఇప్పుడొక బృందం తయారైంది. ఈ బృందంలో పలువురు పేరున్న హీరోయిన్లు కూడా ఉండటం విశేషం. దేశ పర్యాటక పునరుద్ధరణకు మద్దతు ఇవ్వడానికి నిరంతరం

శ్రీలంకకు దక్షిణ భారత నటీమణులు, ప్రముఖులు

శ్రీలంకకు దక్షిణ భారత నటీమణులు, ప్రముఖులు తరలిపోతున్నారు. అక్కడ ఫ్యాషన్ షూట్‌లు నిర్వహించేందుకు ఇప్పుడొక బృందం తయారైంది. ఈ బృందంలో పలువురు పేరున్న హీరోయిన్లు కూడా ఉండటం విశేషం. దేశ పర్యాటక పునరుద్ధరణకు మద్దతు ఇవ్వడానికి నిరంతరం ప్రయత్నిస్తూ, దానికి అతిపెద్ద మార్కెట్ అయిన భారతదేశంతో బంధాన్ని పటిష్టం చేస్తూ, శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ భారతదేశంలోని ప్రముఖ నటీనటులు మరియు ప్రముఖ వ్యక్తులకు ఆతిథ్యాన్ని అందించింది. నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్స్, యూట్యూబర్స్‌తో కూడిన.. ముఖ్యంగా దక్షిణ భారతదేశ నగరాలకి చెందిన ఈ బృందం శనివారం, మార్చి 26న కొలంబో చేరుకుని దాదాపు ఆరు రోజుల పాటు.. శ్రీలంక యొక్క పర్యావరణ, సాంస్కృతిక చైతన్యం ఆస్వాదించడం జరిగింది.


తమ ట్యాలెంట్‌తో, తమ ట్రావెల్ వీడియోస్ ద్వారా దేశ వ్యాప్తంగా లక్షల్లో అభిమానుల్ని సొంతం చేసుకున్న అవికాగోర్ (చిన్నారి పెళ్ళికూతురు సీరియల్ ఫేం), గెహ్నహరేష్సిప్పీ (టాలీవుడ్ నటి ‘చోర్ బజార్’ సినిమా ఫేం), అపూర్వ శ్రీనివాసన్ (నటీ, మై సౌత్ దివా వ్లాగర్), రుహాని శర్మ (టాలీవుడ్ నటి), తాన్యా హోప్ (తెలుగు, తమిళ్, కన్నడ భాషల నటి) మరియు మనోజ్ కుమార్ కాటోకర్ (ప్రముఖ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్, మై సౌత్ దివా వ్యవస్థాపకుడు) ఈ బృందంలో సభ్యులు. ట్రిప్ సిన్నమోన్బెంటోటా బీచ్‌లో మొదలై.. అక్కడి నుండి దగ్గరలోని చూడతగిన ప్రదేశాలను ఈ బృందం చుట్టేసింది. అలానే దగ్గరలోని రిజర్వ్ ఫారెస్ట్లో జరిగిన ‘ట్రీ-ప్లాంటేషన్’ కార్యక్రమంలో కూడా వీరు పాలుపంచుకున్నారు. శ్రీలంక యొక్క ప్రముఖ డిఎమ్‌సి (డెస్టినేషన్ మేనేజ్‌మెంట్ కంపెనీ), వాకర్స్ టూర్స్ వీటిని నిర్వహించాయి. అక్కడి ప్రాపర్టీస్‌లోనే ఈ బృందంతో, మై సౌత్ దివా తమ తదుపరి వార్షిక క్యాలెండర్‌ను చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. మొత్తంగా ఈ బృందం నిర్వహించిన ఈ ట్రిప్ విజయవంతం అయినట్లుగా బృంద సభ్యులు పేర్కొన్నారు.


Updated Date - 2022-04-03T23:36:34+05:30 IST

Read more