సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Mothers Day: తల్లి కలను నెరవేర్చిన Raashii Khanna

ABN, First Publish Date - 2022-05-08T21:53:40+05:30

అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న కథా నాయిక రాశీఖన్నా(Raashii Khanna). వరుస ప్రాజెక్టులు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న కథా నాయిక రాశీఖన్నా(Raashii Khanna). వరుస ప్రాజెక్టులు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ‘ఊహలు గుసగుసలాడే’ (Oohalu Gusagusalade), ‘బెంగాల్ టైగర్’ (Bengal Tiger), ‘తొలి ప్రేమ’ (tholi prema) వంటి సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైంది. ప్రస్తుతం నాగచైతన్య (Naga Chaitanya) సరసన ‘థాంక్ యూ’ (Thank You) మూవీలో నటించింది. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.  మదర్స్ డే సందర్భంగా రాశీ సొంత పట్టణానికీ వచ్చింది. తన తల్లి కలను నెరవేర్చింది. అదేంటో తెలుసుకోవాలనుందా..


‘మదర్స్ డే’ ను పురస్కరించుకుని రాశీ ఖన్నా తన తల్లిని సర్‌ప్రైజ్ చేసింది. లగ్జరీ బ్రాండ్‌కు చెందిన బీఎమ్‌డబ్ల్యూ-7 సిరీస్ (BMW-7series) కారును బాహుమతిగా ఇచ్చి ఆమె కోరికను నెరవేర్చింది. రాశీ కొనుగోలు చేసిన కారు విలువ దాదాపుగా రూ.1.4కోట్లు ఉంటుందని తెలుస్తోంది. భారత్‌లో అందుబాటులో ఉన్న ప్రీమియం టాప్ మోడల్ కారును ఈ అందాల భామ కొనుగోలు చేసిందని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. ఇక కెరీర్ విషయానికి వస్తే.. రాశీ ఖన్నా హీరోయిన్‌గా బాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇస్తుంది. ధర్మ ప్రొడక్షన్స్ ( Dharma Productions) నిర్మిస్తున్న ‘యోధ’ (Yodha) సినిమాలో నటిస్తుంది. పలు ప్రాంతీయ భాష చిత్రాలు కూడా చేస్తుంది. త్వరలోనే ఆమె ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇవ్వనుంది. అమెజాన్ ప్రైమ్ ( Amazon Prime) తెరకెక్కిస్తున్న ‘ఫర్జీ’ (Farzi) వెబ్ సిరీస్‌లో కీలక పాత్ర పోషిస్తుంది.



Updated Date - 2022-05-08T21:53:40+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!