ప్రియాంకకు మరో లక్కీ ఛాన్స్‌?

ABN , First Publish Date - 2022-03-17T18:38:58+05:30 IST

కోలీవుడ్‌ హీరో శివకార్తికేయన్‌ నటించిన ‘డాక్టర్‌’ చిత్రంలో నటించిన ప్రియాంకా అరుళ్‌ మోహన్‌కు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ‘డాక్టర్‌’ చిత్రం తర్వాత ఆమె ఇటీవల సూర్య హీరోగా వచ్చిన ‘ఎదర్కుం తుణిందన్‌’ చిత్రంలో ప్రధాన హీరోయిన్‌గా నటించింది.

ప్రియాంకకు  మరో లక్కీ ఛాన్స్‌?

కోలీవుడ్‌ హీరో శివకార్తికేయన్‌ నటించిన ‘డాక్టర్‌’ చిత్రంలో నటించిన ప్రియాంకా అరుళ్‌ మోహన్‌కు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ‘డాక్టర్‌’ చిత్రం తర్వాత ఆమె ఇటీవల సూర్య హీరోగా వచ్చిన ‘ఎదర్కుం తుణిందన్‌’ చిత్రంలో ప్రధాన హీరోయిన్‌గా నటించింది. ఈ రెండు చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఈ చిత్రాల తర్వాత మళ్ళీ శివకార్తికేయన్‌ ‘డాన్‌’లోనూ ప్రియాంకకు అవకాశం లభించింది. ఈ చిత్రం మే 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ 169వ చిత్రాన్ని చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇందులో ఒక పాత్రకు ప్రియాంకా అరుళ్‌ మోహన్‌ను ఎంపికచేసారనే వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో రజనీకాంత్‌ సరసన ఐశ్యర్యరాయ్‌ను ఎంపిక చేయనున్నారు. ఇందులో ప్రియాంక ఓ కీలక పాత్ర పోషించనున్నట్టు సమాచారం. ఇటీవల రజనీకాంత్‌ ‘అన్నాత్త’ చిత్రంలో కీర్తి సురేష్‌ చెల్లిగా నటించిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-03-17T18:38:58+05:30 IST

Read more