‘‘హింస నాకు నచ్చదు... హింసకే నేనంటే ఇష్టం!’’

ABN , First Publish Date - 2022-03-28T01:30:49+05:30 IST

కరోనా కష్టాలు, కోవిడ్ లాకౌడ్‌న్‌ల అనంతరం బాక్సాపీస్ ఎట్టకేలకు మరోమారు కళకళలాడుతోంది. దాదాపు రెండు సంవత్సరాల తరువాత ‘ద కాశ్మీర్ ఫైల్స్’ సినిమాతో జనం మళ్లీ పెద్ద ఎత్తున థియేటర్ల బాట పట్టారు. ఆ ఊపుని కొనసాగిస్తూ ‘ఆర్ఆర్ఆర్’ ప్యాన్ ఇండియా సెన్సేషన్‌గా నిలిచింది. రాజమౌళి మాస్టర్ పీస్ వందల కోట్లు కొల్లగొట్టే పనిలో ఉంది. అయితే, ఇండియన్ బాక్సాఫీస్ జోష్ ఏ మాత్రం తగ్గనీయకుండా యశ్ వచ్చేస్తున్నాడు! ‘కేజీఎఫ్ చాప్టర్ 2’తో రిటర్న్ ఆఫ్ రాకీ భాయ్‌కి కౌంట్‌డౌన్ మొదలైపోయింది...

ఏప్రెల్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోన్న యశ్ అండ్ శ్రీనిధి శెట్టి స్టారర్ ప్రస్తుతం ట్రైలర్‌తో కలకలం రేపుతోంది. ‘కేజీఎఫ్ చాప్టర్ 1’ చూసిన ఆడియన్స్ తమపై పెట్టిన అంచనాల్ని నిజం చేసుకునేలా ఫిల్మ్ మేకర్స్ ‘చాప్టర్ 2’ ట్రైలర్ వదిలారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ యాజ్‌యూజ్‌వల్ హీరో ఎలివేషన్ సీన్స్‌లో తనను తానే మించిపోయాడు. అలాగే డైలాగ్స్ కూడా అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా, హీరో యశ్ ‘‘వయొలెన్స్‌ని నేను లైక్ చేయను. వయొలెన్సే నన్ను లైక్ చేస్తుంది...’’ అనటం సినిమా ఎంత రక్తసిక్తంగా ఉంటుందో చెప్పకనే చెబుతోంది. 

బాలీవుడ్ ప్రేక్షకుల్ని ప్రత్యేకంగా ఆకర్షించేలా సంజయ్ దత్, రవీనా టాండన్ పాత్రల్ని గంభీరంగా కొనసాగించాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. వారిద్దరి క్యారెక్టర్స్, డైలాగ్స్ కూడా ట్రైలర్‌ పట్ల ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఏప్రెల్ 14న హిందీతో పాటూ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానున్న ‘కేజీఎప్ : ఛాప్టర్ 2’పై అంచనాల్ని పెంచేస్తున్నాయి. 

‘కేజీఎఫ్ 2’ ట్రైలర్ లాంచ్ వేడుక బెంగళూరులో ఘనంగా నిర్వహించారు. హోస్ట్‌గా బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహర్ వ్యవహరించగా శాండల్‌వుడ్ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెలుగు వర్షన్ రామ్‌చరణ్, తమిళంలో సూర్య, మలయాళంలో పృథ్వీరాజ్, హిందీ ట్రైలర్‌ని ఫర్హాన్ అఖ్తర్ ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. ట్విట్టర్, యూట్యూబ్ లాంటి సొషల్ మీడియా వేదికల్లో ‘కేజీఎఫ్’ హ్యాష్‌ట్యాగ్ ఫుల్ ఫోర్స్‌తో ట్రెండ్ అవుతోంది. Updated Date - 2022-03-28T01:30:49+05:30 IST