సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

FEFSIతో ఒప్పందం రద్దు: నిర్మాతల మండలి ప్రకటన

ABN, First Publish Date - 2022-05-05T02:05:29+05:30

దక్షిణ భారత సినీ నిర్మాణ కార్మికుల సంఘం (ఫెఫ్సీ FEFSI)తో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్టు తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి (TFPC) ప్రకటించింది. ఇకపై నిర్మాతలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దక్షిణ భారత సినీ నిర్మాణ కార్మికుల సంఘం (ఫెఫ్సీ FEFSI)తో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్టు తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి (TFPC) ప్రకటించింది. ఇకపై నిర్మాతలు తమ చిత్రాల నిర్మాణ కార్యక్రమాలకు సినీ కార్మికులను ఎవరినైనా ఎంచుకోవచ్చని పేర్కొంది. ఈ నెల 2న తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి కార్యకవర్గ సమావేశం జరిగింది. ఇందులో కొన్ని కీలక తీర్మానాలను అమోదించారు. ఫెఫ్సీ, నిర్మాతల మండలి మధ్య కొన్నేళ్ళుగా ఒక ఒప్పందం కొనసాగుతుంది. 


ఇందులో భాగంగా వచ్చే మూడేళ్ళకు సంబంధించిన ఒప్పందాన్ని కూడా మార్చి 9న కుదుర్చుకున్నారు. అయితే ఈ ఒప్పందానికి తూట్లు పొడిచేలా ఫెఫ్సీకి చెందిన వారు ప్రవర్తిస్తున్నారంటూ, ఈ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టు నిర్మాతల మండలి ప్రకటించింది. అందువల్ల ఇకపై నిర్మాతల మండలికి చెందిన సభ్యులు తమకు అవసరమైన సినీ నిర్మాణ కార్మికులను సొంతంగా ఎవరినైనా నియమించుకుని తమ సినిమా షూటింగు జరుపుకోవచ్చని నిర్మాతల మండలి విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది.



Updated Date - 2022-05-05T02:05:29+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!