మోహన్ లాల్ మలయాళం సినిమాలో తెలుగు డైలాగ్స్
ABN , First Publish Date - 2022-03-23T15:17:04+05:30 IST
పరాయి భాషా చిత్రాల్లో .. తెలుగు డైలాగ్స్ వినిపించడం ఇప్పుడు కామన్ గా మారింది. బహుశా అది పాన్ ఇండియా చిత్రాల ప్రభావం కావచ్చు. ఇది వరకు 'బాహుబలి', రీసెంట్ గా 'పుష్ప' చిత్రాలతో ఇతర భాషల వారికి తెలుగు సినిమాల మీద ఆసక్తి కలుగుతోంది. రీసెంట్ గా మోహన్ లాల్ నటించిన మలయాళ చిత్రం 'ఆరాట్టు' సూపర్ హిట్ అయింది. అందులో ఆయన తరచుగా తెలుగు డైలాగ్స్ పలకడం విశేషం. ప్రత్యర్ధులకి వార్నింగ్ ఇవ్వడానికి ఆయన తెలుగు డైలాగ్స్ ను వాడడం చూడొచ్చు. ఎక్కువగా ‘నేను చాలా డేంజరస్’, ‘నిన్ను నేను చంపేస్తాను’ అనే డైలాగ్స్ తరచుగా వినిపిస్తూంటాయి. అలాగే మరికొన్ని సన్నివేశాల్లో తెలుగు డైలాగ్స్ పలికారు.

పరాయి భాషా చిత్రాల్లో .. తెలుగు డైలాగ్స్ వినిపించడం ఇప్పుడు కామన్ గా మారింది. బహుశా అది పాన్ ఇండియా చిత్రాల ప్రభావం కావచ్చు. ఇది వరకు 'బాహుబలి', రీసెంట్ గా 'పుష్ప' చిత్రాలతో ఇతర భాషల వారికి తెలుగు సినిమాల మీద ఆసక్తి కలుగుతోంది. రీసెంట్ గా మోహన్ లాల్ నటించిన మలయాళ చిత్రం 'ఆరాట్టు' సూపర్ హిట్ అయింది. అందులో ఆయన తరచుగా తెలుగు డైలాగ్స్ పలకడం విశేషం. ప్రత్యర్ధులకి వార్నింగ్ ఇవ్వడానికి ఆయన తెలుగు డైలాగ్స్ ను వాడడం చూడొచ్చు. ఎక్కువగా ‘నేను చాలా డేంజరస్’, ‘నిన్ను నేను చంపేస్తాను’, ‘నేను వాడిని చంపేస్తాను’ అనే డైలాగ్స్ తరచుగా వినిపిస్తూంటాయి. అలాగే మరికొన్ని సన్నివేశాల్లో తెలుగు డైలాగ్స్ పలికారు. ‘నేను చాలా డేంజరస్’ అనే డైలాగ్ తో సినిమాకి పబ్లిసిటీ కూడా చేశారు.
ఇంకా అందులో మోహన్ లాల్ ‘శంకరాభరణం’ మూవీలోని శంకరా అనే పాట పాడి వినిపిస్తారు. అప్పట్లో ‘శంకరాభరణం’ చిత్రం మలయాళంలో డబ్బింగ్ అయింది. అయితే కేవలం డైలాగ్స్ మాత్రమే మలయాళంలోకి అనువదించారు. పాటల్ని యాజిటీజ్ గా తెలుగులోనే ఉంచేశారు. సినిమా అక్కడ కూడా సూపర్ హిట్ అవడంతో అందులోని పాటలు కూడా విపరీతమైన ప్రజాదరణ పొందాయి. ఈ కారణంగానే మోహన్ లాల్ నోట శంకరా పాట వినిపించిందని అర్ధమవుతోంది. బి. ఉన్నికృష్ణన్ దర్శకత్వంలో రూపొందిన ‘ఆరాట్టు’ చిత్రంలో మోహన్ లాల్ ‘నెయ్యాట్టుక్కర గోపన్’ అనే మాస్ పాత్ర పోషించారు. ఒక ల్యాండ్ విషయమై సమస్యలు ఎదుర్కొంటున్న ఒక గ్రామంలోకి అడుగుపెట్టిన గోపన్.. ఆ సమస్యను ఎలా పరిష్కరించాడు అనేది కథాంశం. అయితే ఇందులో ఒక విలన్ గా నటించిన గురుడ రామ్ తెలుగు వాడవడంతో .. అతడితో మోహన్ లాల్ తెలుగు డైలాగ్స్ పలుకుతారు. రీసెంట్ గా ఓటీటీలో విడుదలైన ఈసినిమాకి అక్కడ కూడా మంచి రెస్పాన్స్ దక్కుతోంది. రాబోయే మరిన్ని మలయాళ సినిమాల్లో తెలుగు డైలాగ్స్ వాడతారేమో చూడాలి.