సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Udayanidhi: మంత్రి అయిన హీరో.. అభినందనలు తెలిపిన నిర్మాతల మండలి

ABN, First Publish Date - 2022-12-14T11:02:22+05:30

‘శీనుగాడి లవ్ స్టోరీ’, ‘ఒకే ఒకే’ వంటి పలు డబ్బింగ్ చిత్రాలతో తెలుగులోనూ గుర్తింపు పొందిన నటుడు ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin).

Udayanidhi
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘శీనుగాడి లవ్ స్టోరీ’, ‘ఒకే ఒకే’ వంటి పలు డబ్బింగ్ చిత్రాలతో తెలుగులోనూ గుర్తింపు పొందిన నటుడు ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin). ఆయన ఓ వైపు సినిమా (Movies)ల్లో హీరో (Hero)గా, నిర్మాతగా రాణిస్తూనే మరో వైపు రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా ఉన్నారు. తమిళనాడు (Tamil Nadu)లో ఇంతకుముందు జరిగిన ఎన్నికల్లో ట్రిప్లికేన్‌ - చెప్పాక్కం ఎమ్మేల్యేగా ఎన్నికయ్యారు. తాజాగా ముఖ్యమంత్రి స్టాలిన్‌ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా బుధవారం ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

దీంతో ఉదయనిధిని తమిళనాడు చలనచిత్ర నిర్మాతల మండలి తరపున ఆ మండలి అధ్యక్షుడు తేనాండల్‌ మురళీ తాజాగా అభినందించారు. ఉదయనిధిని కలిసి శాలువా కప్పి విషెస్‌ చెప్పారు. దివంగత కరుణానిధి ఆశీర్వాద బలంతో ముఖ్యమంత్రి స్టాలిన్‌ మార్గనిర్దేశకత్వంలో మంత్రిగా అత్యుత్తమ సేవలందించి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని నిర్మాతల మండలి తరపునే కాకుండా, తమిళ చిత్రపరిశ్రమ తరపున అభినందనలు తెలుపుతున్నట్టు మురళి విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - 2022-12-14T11:02:24+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!