Vijay: నాకు నేనే పోటీ

ABN , First Publish Date - 2022-12-25T17:23:52+05:30 IST

కోలీవుడ్ స్టార్ విజయ్ (Vijay) హీరోగా నటించిన సినిమా ‘వారిసు’ (Varisu). రష్మిక మందన్నా (Rashmika Mandanna) హీరోయిన్‌గా నటించింది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. భారీ బడ్జెట్‌తో దిల్ రాజు నిర్మించాడు.

Vijay: నాకు నేనే పోటీ

కోలీవుడ్ స్టార్ విజయ్ (Vijay) హీరోగా నటించిన సినిమా ‘వారిసు’ (Varisu). రష్మిక మందన్నా (Rashmika Mandanna) హీరోయిన్‌గా నటించింది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. భారీ బడ్జెట్‌తో దిల్ రాజు నిర్మించాడు. ఈ మూవీ తెలుగులో ‘వారసుడు’ (Varasudu) టైటిల్‌తో విడుదల కానుంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఆడియో లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. చెన్నైలోని నెహ్రు స్టేడియంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ ఈవెంట్‌కు భారీ ఎత్తున అభిమానులు హాజరయ్యి జయప్రదం అయ్యారు. ఆడియో లాంచ్‌లో భాగంగా జానీ మాస్టర్‌తో కలసి రష్మిక డ్యాన్స్ చేసింది. హీరో విజయ్ కూడా పాట పాడి అభిమానులను అలరించాడు. తన స్పీచ్‌తోను అదరగొట్టాడు.

‘‘ఓ నటుడు 1990లో తనకు పోటీగా వచ్చాడు. కొంతకాలం తర్వాత అతడు చాలా గట్టి పోటీ ఇవ్వడం ప్రారంభించాడు. నేను ఎక్కడికి వెళితే అక్కడకు రావడం ప్రారంభించాడు. అతణ్ని బీట్ చేయడానికి నేను చాలా గట్టిగా ప్రయత్నించాను. ఇప్పటికి కూడా ప్రయత్నిస్తున్నాను. ఆ పోటీదారుని పేరు దళపతి విజయ్. మీకు మీరే పోటీగా మారండి’’ అని విజయ్ చెప్పాడు. ‘వారిసు’ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతుంది. ఈ చిత్రంలో ప్రభు, శరత్ కుమార్, జయ సుధ, ప్రకాష్ రాజ్, కిక్ శ్యామ్, యోగి బాబు, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా తెలుగు, తమిళ్‌, హిందీలో విడుదల కానుంది. ఇక విజయ్ కెరీర్ విషయానికి వస్తే.. ‘వారసుడు’ తర్వాత లోకేశ్ కనకరాజ్‌తో సినిమా చేయనున్నాడు. త్రిష హీరోయిన్‌గా నటిస్తుంది. సినిమాటిక్ యూనివర్స్ నేపథ్యంలో తెరకెక్కుతుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.

Updated Date - 2022-12-25T17:23:53+05:30 IST