Kaliyugam: ప్రపంచ యుద్ధం తర్వాత.. ఫస్ట్ లుక్

ABN , First Publish Date - 2022-12-17T22:31:42+05:30 IST

హీరోయిన్‌ శ్రద్ధా శ్రీనాథ్‌ (Shraddha Srinath), నటుడు కిషోర్‌ (Kishore) ప్రధాన పాత్రలలో రూపొందుతున్న ‘కలియుగం’ (Kaliyugam) చిత్రం ఫస్ట్‌లుక్‌ను తాజాగా..

Kaliyugam: ప్రపంచ యుద్ధం తర్వాత.. ఫస్ట్ లుక్
Kaliyugam Movie First Look

హీరోయిన్‌ శ్రద్ధా శ్రీనాథ్‌ (Shraddha Srinath), నటుడు కిషోర్‌ (Kishore) ప్రధాన పాత్రలలో రూపొందుతున్న ‘కలియుగం’ (Kaliyugam) చిత్రం ఫస్ట్‌లుక్‌ను తాజాగా రిలీజ్‌ చేశారు. ప్రైమ్‌ సినిమాస్‌ కేఎస్‌ రామకృష్ణ, ఆర్‌.కె.ఇంటర్నేషనల్‌ ఇన్‌కార్పొరేట్‌ బ్యానరుపై నిర్మించారు. ప్రమోద్‌ సుందర్‌ దర్శకుడు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం చివరి దశ నిర్మాణ పనులు ముమ్మరంగా జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో సినిమా ఫస్ట్‌లుక్‌ను తాజాగా రిలీజ్‌ చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు ప్రమోద్‌ సుందర్‌ (Pramod Sundar) మాట్లాడుతూ.. ప్రపంచ యుద్ధం (World War) తర్వాత ప్రజలు ఎదుర్కొన్న సమస్యలతో పాటు అనేక సమకాలీన సంక్షోభాలు, యుద్ధం తదనంతర పరిణామాలు, యుద్ధం కారణంగా అనేక దేశాలు ఎదుర్కొన్న సమస్యలు, ఆ యుద్ధం ఫలితం తదితర అంశాలను ఈ చిత్రంలో ప్రధానంగా ప్రస్తావించడం జరిగిందని తెలిపారు. కాగా, ఈ సినిమాకు కెమెరా కె. రామ్‌ చరణ్‌, సంగీతం డాన్‌ విన్సెంట్‌.

Updated Date - 2022-12-17T22:31:44+05:30 IST