Connect Twitter Review: నయనతార హార్రర్ మూవీ ఎలా ఉందంటే..

ABN, First Publish Date - 2022-12-22T09:28:35+05:30

సౌత్ లేడీ సూపర్ స్టార్ నయన తార (Nayanathara) నటించిన తాజా హార్రర్ చిత్రం ‘కనెక్ట్’ (Connect).

Connect Twitter Review: నయనతార హార్రర్ మూవీ ఎలా ఉందంటే..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సౌత్ లేడీ సూపర్ స్టార్ నయన తార (Nayanathara) నటించిన తాజా హార్రర్ చిత్రం ‘కనెక్ట్’ (Connect). అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నయనతార భర్త, దర్శకుడు విష్నేశ్ శివన్ (Vignesh Shivan) నిర్మించాడు. సత్యరాజ్, అనుపమ్ ఖేర్, వినయ్ రాయ్ కీలకపాత్రల్లో నటించిన ఈ చిత్రం నేడు (డిసెంబర్ 22న) థియేటర్స్‌లో విడుదలైంది. కానీ.. ఇప్పటికే పలు చోట్ల ఈ చిత్రం ప్రీమియర్ షోలు పడిపోయాయి. దీంతో పలువురు నెటిజన్లు ట్విట్టర్ వేదికగా సినిమాకి రివ్యూ (Review)లు ఇస్తున్నారు.

‘కనెక్ట్ చూడదగిన చిత్రం.. పిల్లలతో మాత్రం వెళ్లకండి’.. ‘మంచి అనుభూతి. విష్నేశ్ శివన్, రౌడీ పిక్చర్స్ చాలా బాగా తెరకెక్కించాడు. కొన్ని చోట్ల హార్రర్ అయితే పీక్స్‌లో ఉంది. సినిమాటోగ్రఫీలాగే మ్యూజిక్ అనుభూతిని అందించింది. సినిమా చాలా బావుంది’.. ‘‘మంచి సౌండ్ ఎఫెక్ట్‌తో ఉన్న మంచి సినిమా ‘కనెక్ట్’. ఇంటర్వెల్ సమయంలో ఎఫెక్ట్ తగ్గింది. కానీ మొత్తంగా చూస్తే మంచి సినిమా’.. ‘చాలా బావుంది. డోల్బీ ఆట్మోస్‌ మాత్రమే చూడండి. సినిమాకి ఇంటర్వెల్ లేనే లేదు’ అని పలువురు రాసుకొచ్చారు. నెటిజన్ల రియాక్షన్ ఎలా ఉందో ఇక్కడ చూడండి.

Updated Date - 2022-12-22T09:28:36+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!