తొలిసారి.. జీవీ ప్రకాష్‌ ఐశ్వర్య రాజేష్‌ జంటగా!

ABN , First Publish Date - 2022-12-13T22:19:33+05:30 IST

సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌, ఐశ్వర్య రాజేష్ జంటగా తొలిసారి ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ ప్రారంభోత్సవ

తొలిసారి.. జీవీ ప్రకాష్‌ ఐశ్వర్య రాజేష్‌ జంటగా!
Aishwarya Rajesh and GV Prakash Movie Opening

సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌ కుమార్ (GV Prakash Kumar), ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) జంటగా తొలిసారి ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ ప్రారంభోత్సవ పూజా కార్యక్రమం తాజాగా చెన్నై నగరంలో జరిగింది. ఇందులో అనేక మంది సినీ ప్రముఖులు పాల్గొని చిత్ర బృందానికి విషెస్‌ చెప్పారు. నట్‌మగ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానరుపై నిర్మితమయ్యే ఈ చిత్రానికి దర్శకత్వం ఆనంద్‌ రవిచంద్రన్‌. ఇతర పాత్రల్లో కాళి వెంకట్‌, ఇళవరసు, రోహిణి, ‘తలైవాసల్‌’ విజయ్‌, గీతా కైలాసం, ‘బ్లాక్‌ షీప్‌’ నందిని తదితరులు నటిస్తున్నారు. ఐశ్వర్యరాజేష్‌ నటించి జాతీయ అవార్డు గెలుచుకున్న ‘కాక్కాముట్టై’కు జీవీ ప్రకాష్‌ సంగీతం సమకూర్చారు. ఇపుడు ఐశ్వర్య - జీవీ ప్రకాష్ కలిసి తొలిసారి ఒకే ఫ్రేంలో కనిపించనుండటంతో వారి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-12-13T22:20:20+05:30 IST

Read more