సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Ponniyin Selvan 2: విడుదల తేది ఖరారు..

ABN, First Publish Date - 2022-12-28T16:44:02+05:30

స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహించిన సినిమా పొన్నియిన్ సెల్వన్ (Ponniyin Selvan). రెండు భాగాలుగా తెరకెక్కింది. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మించాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 30న ‘పొన్నియిన్ సెల్వన్ 1’ విడుదలైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహించిన సినిమా పొన్నియిన్ సెల్వన్ (Ponniyin Selvan). రెండు భాగాలుగా తెరకెక్కింది. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మించాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 30న ‘పొన్నియిన్ సెల్వన్ 1’ విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. వరల్డ్ వైడ్‌గా రూ.600కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. మొదటి భాగం అంచనాలను మించి రాణించింది. కోలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. అందువల్ల ప్రేక్షకులు రెండో భాగం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ ‘పొన్నియిన్ సెల్వన్ 2’ (Ponniyin Selvan 2) విడుదల తేదిని ప్రకటించారు.

‘పొన్నియిన్ సెల్వన్ 2’ ను వచ్చే ఏడాది ఏప్రిల్ 28న విడుదల చేస్తామని చిత్ర బృందం పేర్కొంది. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ‘పొన్నియిన్ సెల్వన్ 1’ మల్టీ‌స్టారర్‌గా రూపొందింది. ఈ సినిమాలో రాజరాజ చోళునిగా జయం రవి (Jayam Ravi), ఆదిత్య కరికాలన్‌గా విక్రమ్ (Vikram), నందిని‌గా ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai), వంథియ దేవన్‌గా కార్తి (Karthi), కుందవైగా త్రిష (Trisha) నటించారు. జయరాం (Jayaram), ప్రకాష్ రాజ్ (Prakash Raj), ప్రభు (Prabhu), శరత్ కుమార్, పార్తీబన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఏఆర్. రెహమాన్ సంగీతం అందించాడు. ఎడిటింగ్ బాధ్యతలను శ్రీకర్ ప్రసాద్ నిర్వహించాడు. ప్రొడక్షన్ డిజైనర్‌గా తోట తరణి పనిచేశాడు.

Updated Date - 2022-12-28T16:48:50+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!