Kollywood: ‘హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారు’

ABN , First Publish Date - 2022-12-15T09:56:23+05:30 IST

మూన్‌ పిక్చర్స్‌ బ్యానరుపై నిర్మాత ఆదంభవ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ఉయిర్‌ తమిళుక్కు’ (Uyir Tamilukku). ఈ చిత్ర ట్రైలర్‌, ఆడియో తాజాగా విడుదల చేశారు.

Kollywood: ‘హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారు’

మూన్‌ పిక్చర్స్‌ బ్యానరుపై నిర్మాత ఆదంభవ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ఉయిర్‌ తమిళుక్కు’ (Uyir Tamilukku). ఈ చిత్ర ట్రైలర్‌, ఆడియో తాజాగా విడుదల చేశారు. అమీర్‌ (Ameer), చాందిని శ్రీధన్‌ హీరో హీరోయిన్లుగా నటించగా.. ఆనంద్‌ రాజ్‌, ఇమాన్‌ అన్నాచ్చి, మారిముత్తు, రాజ్‌ కపూర్‌, సుబ్రమణ్యశివ, మహానది శంకర్‌, రాజసింహన్‌, శరవణ చక్రవర్తి కీలక పాత్రల్లో నటించారు. విద్యాసాగర్‌ సంగీతం అందించారు.

ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అమీర్‌ మాట్లాడుతూ.. ‘‘మౌనం పేసియదే’ మూవీ ద్వారా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు గడిచిపోయాయి. నాకు ఖద్దరు పంచె కట్టి రాజకీయ నాయకుడిగా నటించాలనే ఆశ ఎప్పటి నుంచో ఉంది. ఆ కోరిక ఈ చిత్రంతో తీరిపోయింది. నిజానికి ఈ చిత్రానికి వేరే టైటిల్‌ పెట్టాలని భావించారు. కానీ, నిర్మాత సురేష్‌ కామాక్షి ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేసేందుకు ముందుకు రావడంతో నా చిత్రానికి రిజిస్టర్‌ చేయించుకున్న ‘ఉయిర్‌ తమిళుక్కు’ టైటిల్‌ ఇచ్చాను. ఈ సినిమాకు సరిగ్గా సరిపోయింది. నటుడు ఆనంద్‌ రాజ్‌ను విలన్‌గా కంటే, కమెడియన్‌గా ప్రతి ఒక్కరు ఆదరిస్తున్నారు. గత కొన్ని రోజులుగా హిందీ (Hindi)ని బలవంతంగా రుద్దే ప్రయత్నం జరుగుతుంది. ఉత్తరాది వారు వలస రావడంతో తమిళ (Tamil) భాషకు అన్యాయం జరుగుతుంది. ఇలాంటి సమయంలో ఈ మూవీకి ‘ఉయిర్‌ తమిళుక్కు’ టైటిల్‌ అతికినట్టు సరిపోతుంది’ అని అన్నారు.

నిర్మాత సురేష్‌ కామాక్షి (Suresh Kamakshi) మాట్లాడుతూ, ‘ఈ సినిమా టైటిల్‌ నా మనస్సుకు బాగా నచ్చింది. ఇపుడున్న పరిస్థితులకు కావాల్సిన టైటిల్‌. నేను నిర్మించే చిత్రాల రిలీజ్‌ హక్కులను వేరే సంస్థలకు ఇస్తాను. అమీర్‌ నా స్నేహితుడు. అందుకే నేను సొంతంగా రిలీజ్‌ చేసేందుకు ముందుకు వచ్చాను’ అని చెప్పారు. సుబ్రమహ్మణ్య శివ, ఇమాన్‌ అన్నాచ్చి, దర్శకుడు రాజ్‌కుమార్‌, నిర్మాత సురేష్‌ కామాక్షి, నటుడు ఆనంద్‌ రాజ్‌ మాట్లాడారు.

Updated Date - 2022-12-15T09:56:26+05:30 IST