సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Trisha: రాజకీయాలతో నాకు సంబంధం లేదు

ABN, First Publish Date - 2022-12-26T10:58:31+05:30

చిత్రపరిశ్రమకు వచ్చి 20 యేళ్ళ గడిచిపోయాయని, ఈ రెండు దశాబ్దాల్లో వాస్తవిక అంశాలను మాత్రమే పరిగణనలోకి..

Heroine Trisha
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాను కాంగ్రెస్‌ పార్టీ (Congress Party)లో చేరబోతున్నట్టు జరిగిన ప్రచారంలో రవ్వంత కూడా నిజం లేదని, అస్సలు తనకు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని హీరోయిన్‌ త్రిష స్పష్టం చేసింది. ఆమె నటించిన కొత్త చిత్రం ‘రాంగీ’ (Raangi) ఈ నెల 30న విడుదలకానుంది. ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రాజకీయ రంగ ప్రవేశంపై వచ్చిన వార్తలపై త్రిష (Trisha) క్లారిటీ ఇచ్చింది.

ఆమె మాట్లాడుతూ.. తాను చిత్రపరిశ్రమకు వచ్చి 20 యేళ్ళ గడిచిపోయాయని, ఈ రెండు దశాబ్దాల్లో వాస్తవిక అంశాలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నానని, విమర్శలను ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరబోతున్నట్టు ఒక ప్రచారం చేశారని, అందులో ఏమాత్రం నిజం లేదని, తనకు రాజకీయాలకు (Politics) రవ్వంత కూడా సంబంధం లేదని స్పష్టం చేసింది. అదేసమయంలో పెళ్ళి ఎపుడు? మీకు ఇష్టమైన నటుడు ఎవరు? వంటి ప్రశ్నలను తనని కొంతకాలం పాటు అడగకుండా ఉండటం మంచిదని సూచించింది.

Updated Date - 2022-12-26T11:00:18+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!