Vaadivaasal: సూర్య ‘వాడివాసల్‌’ ఆగిపోయినట్టేనా?

ABN , First Publish Date - 2022-12-26T12:24:33+05:30 IST

జాతీయ అవార్డు గ్రహీత వెట్రిమారన్‌ (Vetrimaaran) - హీరో సూర్య (Suriya) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘వాడివాసల్‌’ (Vaadivaasal). గత కొంతకాలంగా షూటింగ్‌

Vaadivaasal: సూర్య ‘వాడివాసల్‌’ ఆగిపోయినట్టేనా?
Suriya In Vaadivaasal Movie

జాతీయ అవార్డు గ్రహీత వెట్రిమారన్‌ (Vetrimaaran) - హీరో సూర్య (Suriya) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘వాడివాసల్‌’ (Vaadivaasal). గత కొంతకాలంగా షూటింగ్‌ జరుపుకుంటుంది. ఇపుడు ఈ ప్రాజెక్టు నుంచి సూర్య తప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ వార్తలను ‘వాడివాసల్‌’ చిత్ర బృందం ఖండించడం లేదు.. అలాగే తోసిపుచ్చడం లేదు కూడా. అదేసమయంలో వెట్రిమారన్‌... ‘విడుదలై’ చిత్రం రెండో భాగం షూటింగ్‌ చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసిన వెంటనే ‘వాడివాసల్‌’ ప్రాజెక్టును ప్రారంభించాలని భావిస్తున్నారు. అయితే, సూర్య తప్పుకోవడంతో ఈ ప్రాజెక్టు అర్థాంతరంగా ఆగిపోయిందనే ప్రచారం సాగుతోంది.

కాగా, హీరో సూర్య ‘జైభీమ్‌’ (Jai Bhim), ‘ఈటీ’ (ET) చిత్రాల తర్వాత ‘వాడివాసల్‌’ ప్రాజెక్టుకు కమిట్‌ అయ్యారు. చాలా మేరకు షూటింగ్‌ ముగిసిన దశలో ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్టు వార్తలు రావడంతో సూర్య అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. అయితే ఈ విషయంపై చిత్రయూనిట్ లేదంటే సూర్య అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. ప్రస్తుతానికైతే.. చిత్రయూనిట్ మాత్రం నుంచి ఈ సినిమా ఆగిపోయినట్లుగా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

Updated Date - 2022-12-26T12:24:35+05:30 IST