Arya: బర్త్ డే స్పెషల్‌గా.. విద్యార్థులకు సైకిళ్ళ పంపిణీ

ABN , First Publish Date - 2022-12-13T22:30:25+05:30 IST

హీరో ఆర్య (Arya) తన 41వ పుట్టినరోజు (Birthday) వేడుకను ఆదివారం జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పలువురు పాఠశాల విద్యార్థులకు సైకిళ్లు అందజేశారు. ప్రస్తుతం ముత్తయ్య (Muttayya) దర్శకత్వంలో

Arya: బర్త్ డే స్పెషల్‌గా.. విద్యార్థులకు సైకిళ్ళ పంపిణీ
Hero Arya

హీరో ఆర్య (Arya) తన 41వ పుట్టినరోజు (Birthday) వేడుకను ఆదివారం జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పలువురు పాఠశాల విద్యార్థులకు సైకిళ్లు అందజేశారు. ప్రస్తుతం ముత్తయ్య (Muttayya) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఖాదర్‌ బాషా ఎండ్ర ముత్తురామలింగం’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ తూత్తుక్కుడి పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ఆ షూటింగ్‌ లొకేషన్‌లోనే ఆర్య పుట్టిన రోజు వేడుకలను చిత్ర యూనిట్‌ సభ్యుల మధ్య జరుపుకున్నారు. భారీ కేక్‌ కట్‌ చేసిన ఆర్య.. చిత్ర బృందంతో కలిసి ఎంజాయ్‌ చేశారు. అలాగే, పలువురు విద్యార్థులకు చిత్ర బృందం సైకిళ్లను (Cycles) పంపిణీ చేసింది. ఈ కార్యక్రమంలో నటులు ప్రభు, ఆడుగళం నరేన్‌, హీరోయిన్‌ సిద్ధి ఇద్నానీ, దర్శకుడు ముత్తయ్య సహా మూవీ సభ్యులు పాల్గొన్నారు. ఈ పుట్టిన రోజున తన కుమార్తెతో కలిసి దిగిన ఫొటోను ఆర్య సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

Updated Date - 2022-12-13T22:30:25+05:30 IST

Read more