Gautham Menon: ఆ సినిమాలో విలన్‌గా ఫిక్స్

ABN , First Publish Date - 2022-12-28T19:16:45+05:30 IST

సినిమాలకు దర్శకత్వం వహిస్తూనే అప్పుడప్పుడు వెండి‌తెర పైన మెరుస్తుంటాడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautham Vasudev Menon). ‘ట్రాన్స్’ (Trance), ‘సీతా రామం’ (Sita Ramam) వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు.

Gautham Menon: ఆ సినిమాలో విలన్‌గా ఫిక్స్

సినిమాలకు దర్శకత్వం వహిస్తూనే అప్పుడప్పుడు వెండి‌తెర పైన మెరుస్తుంటాడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautham Vasudev Menon). ‘ట్రాన్స్’ (Trance), ‘సీతా రామం’ (Sita Ramam) వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. తాజాగా గౌతమ్ ఓ పాన్ ఇండియా సినిమాలో అవకాశాన్ని చేజిక్కించుకున్నాడు. ఈ విషయాన్ని అతడే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. పూర్తి వివరాల్లోకి వెళ్లితే..

కోలీవుడ్ స్టార్ విజయ్ (Vijay) హీరోగా లోకేశ్ కనక‌రాజ్ (Lokesh Kanagaraj) ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు‌ వర్కింగ్ టైటిల్ గా ‘దళపతి 67’ (Thalapathy 67) అని వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో విలన్‌గా గౌతమ్ మీనన్ నటిస్తున్నాడని కొంతకాలంగా రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి. ఈ రూమర్స్ నిజమేనని ఓ ఇంటర్వ్యూలో గౌతమ్ మీనన్ అంగీకరించాడు. ఇయర్ ఎండ్‌లో భాగంగా గౌతమ్ మీనన్, లోకేశ్ కనకరాజ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ‘‘లోకేశ్ సినిమాలో నేను ఉన్నాను. ఈ విషయం చెప్పడానికి అతడు అంగీకరించాడు కాబట్టి నేను ఇక్కడే చెబుతున్నాను’’ అని గౌతమ్ మీనన్ పేర్కొన్నాడు. ‘దళపతి‌67’ సినిమాటిక్ యూనివర్స్‌ నేపథ్యంలో పాన్ ఇండియాగా రూపొందుతుంది. ఈ చిత్రంలో ఐదుగురు విలన్స్‌కు చోటుందని సమాచారం. సంజయ్ దత్, అర్జున్ కూడా ఈ సినిమాలో ప్రతినాయక పాత్రలను పోషించనున్నారని తెలుస్తోంది. ‘దళపతి67’ లో త్రిష హీరోయిన్‌గా నటించనుందని కోలీవుడ్ మీడియా తెలుపుతోంది. ఈ మూవీ షూటింగ్ డిసెంబర్‌లోనే ప్రారంభం కావాలి. కానీ, విజయ్ హీరోగా నటిస్తున్న ‘వారిసు’ ఆలస్యం కావడంతో చిత్రీకరణ వాయిదా పడింది. జనవరి మొదటి వారంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది.

Updated Date - 2022-12-28T19:21:18+05:30 IST