Rajinikanth: సూపర్‌స్టార్‌కి శుభాకాంక్షల వెల్లువ.. తలైవా అంటూ..

ABN , First Publish Date - 2022-12-13T10:49:29+05:30 IST

సూపర్‌స్టార్ రజనీకాంత్ (Superstar Rajinikanth) 72వ పుట్టిన రోజు వేడుకలు డిసెంబర్ 12న అంగరంగ వైభవంగా జరిగాయి.

Rajinikanth: సూపర్‌స్టార్‌కి శుభాకాంక్షల వెల్లువ.. తలైవా అంటూ..
rajinikanth

సూపర్‌స్టార్ రజనీకాంత్ (Superstar Rajinikanth) 72వ పుట్టిన రోజు వేడుకలు డిసెంబర్ 12న అంగరంగ వైభవంగా జరిగాయి. ఆయన చెన్నైలో అభిమానులకి అందుబాటులో లేకపోయినప్పటికీ.. ఎప్పటిలాగే ఆయన బర్త్ డే సెలబ్రేషన్స్ (Birthday Celebrations) ఫ్యాన్స్ నిర్వహించారు. ఈ తరుణంలో సినీ, రాజకీయ ప్రముఖులు రజనీకాంత్‌కు సోషల్‌ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు (Tweets) చేశారు.

నా ప్రియ మిత్రుడు, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు జన్మదిన శుభాకాంక్షలు. మంచి ఆరోగ్యంతో దీర్ఘాయుష్సుతో జీవించాలని కోరుకుంటున్నాను.

- ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌

నా ప్రియమైన స్నేహితుడు, మానవతావాది, నా సోదర సమానుడైన రజనీకాంత్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆ భగవంతుడిని

ప్రార్థిస్తున్నాను.

- మాజీ సీఎం ఓ.పన్నీర్‌సెల్వం

నా ప్రియమైన సోదరుడు రజనీకాంత్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.

- మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కు జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆరోగ్యంతో నిండు నూరేళ్లపాటు జీవించాలని కోరుకుంటున్నాను.

- కె.అన్నామలై, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

నా ప్రియ మిత్రుడు రజనీకాంత్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఈ శుభదినాన మీ విజయయాత్ర కొనసాగాలని కోరుకుంటున్నాను.

- హీరో కమల్‌ హాసన్‌

తన అద్వితీయ నటనతో అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న కోలీవుడ్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు.

- ఎమ్మెల్యే ఉదయనిధి

నా ప్రియ మిత్రుడు రజనీకాంత్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయనకు ఆ భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఆయన చేసే అన్ని ప్రయత్నాల్లో విజయం చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.

- నటుడు శరత్‌ కుమార్‌

హ్యాపీ బర్త్‌ డే తలైవా.

- హీరో ధనుష్‌

హ్యాపీ బర్త్‌ డే తలైవా... మీరు మంచి ఆరోగ్యం ఇవ్వాలని ఆ రాఘవేంద్ర స్వామిని ప్రార్థిస్తున్నాను. మీరు ఈలాగే సుఖ సంతోషాలతో జీవించాలి. ఈ ప్రత్యేకమైన రోజున ‘జిగర్తాండ’ షూటింగ్‌ను మీ ఆశీర్వచనాలతో ప్రారంభిస్తున్నాం. గురువే శరణం.

- రాఘవ లారెన్స్‌

హ్యాపీ బర్త్‌ డే సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సర్‌.. మీరు మారు ఎప్పుడూ స్ఫూర్తినీయులుగా ఉండాలి.

- దుల్కర్‌ సల్మాన్‌

హ్యాపీ బర్త్‌డే సర్‌.. ఈ శుభదినాన ‘తలైవర్‌ 72’ పేరుతో కామన్‌ డీపీని రిలీజ్‌ చేయడం సంతోషంగా ఉంది. మీరు మాకు గర్వకారణం. ఎప్పటికీ మారు స్ఫూర్తినిస్తూ ఉండండి.

- దర్శకుడు కేఎస్.రవికుమార్‌

హ్యాపీ బర్త్‌డే తలైవా, లవ్‌ యూ.

- అనిరుధ్‌ రవిచంద్రన్‌

Updated Date - 2022-12-13T10:49:31+05:30 IST