Thunivu: పోరాట సన్నివేశాలతో అలరిస్తున్న ‘తుణివు’ ట్రైలర్

ABN , First Publish Date - 2022-12-31T19:39:46+05:30 IST

తుణివు’ ట్రైలర్ దాదాపు 1.52సెకండ్స్ పాటు ఉంది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందినట్టు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతుంది. పోరాట సన్నివేశాలతో ఆద్యంతం ఆకట్టుకుంది. యాంటీ హీరోగా అజిత్ కనిపించాడు.

Thunivu: పోరాట సన్నివేశాలతో అలరిస్తున్న ‘తుణివు’ ట్రైలర్

కోలీవుడ్ సూపర్ స్టార్స్‌లో అజిత్ కుమార్ (Ajith Kumar) ఒకరు. ‘వేదళం’, ‘వివేకం’, ‘వలీమై’ చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. అజిత్ తాజాగా నటించిన సినిమా ‘తుణివు’ (Thunivu). హెచ్. వినోద్ (H. Vinoth) దర్శకత్వం వహించాడు. మంజు వారియర్ హీరోయిన్‌గా నటించింది. బోనీ కపూర్ భారీ బడ్జెట్‌తో నిర్మించాడు. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. అందులో భాగంగా ట్రైలర్‌ను విడుదల చేశారు.

‘తుణివు’ ట్రైలర్ దాదాపు 1.52సెకండ్స్ పాటు ఉంది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందినట్టు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతుంది. పోరాట సన్నివేశాలతో ఆద్యంతం ఆకట్టుకుంది. యాంటీ హీరోగా అజిత్ కనిపించాడు. గ్రే హెయిర్ స్టైల్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. మంజు వారియర్ కూడా కొన్ని స్టంట్స్ చేసింది. బ్యాంక్ దోపిడి నేపథ్యంలో సినిమా రూపొందినట్టు తెలుస్తోంది. ‘మాంగత్త’ తర్వాత అజిత్ నెగెటివ్ రోల్‌ను పోషించడం ఇదే మొదటిసారి. అజిత్, వినోద్, బోనీ కపూర్ కలసి పనిచేయడం ఇది మూడోసారి. గతంలో ఈ ముగ్గురు కలసి ‘నెర్కొండ పావై’, ‘వలీమై’ చిత్రాలకు పనిచేశారు. ‘తుణివు’ లో సుందర్, జాన్ కొక్కెన్, మోహన సుందరం, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషించారు. నీరవ్ షా సినిమాటోగ్రాఫర్‌గా పని చేశాడు. జిబ్రాన్ సంగీతం అందించాడు. ఈ చిత్రం తెలుగులో ‘తెగింపు’ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated Date - 2022-12-31T19:46:52+05:30 IST