సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Hero Ajith: 18 నెలలు.. 7 ఖండాలు.. 62 దేశాలు.. అజిత్ క్రేజీ ప్లాన్

ABN, First Publish Date - 2022-10-19T15:50:14+05:30

తమిళం (Tamil) లో మంచి స్టార్ డమ్ ఉన్న నటుల్లో అజిత్ కుమార్ (Ajith kumar) ఒకరు. ఆయనకి తెలుగులోనూ మంచి ఫ్యాన్ బేస్ ఉంది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తమిళం (Tamil) లో మంచి స్టార్ డమ్ ఉన్న నటుల్లో అజిత్ కుమార్ (Ajith kumar) ఒకరు. ఆయనకి తెలుగులోనూ మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే ఆయన ప్రతి సినిమా కోలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌ (Tollywood)లోనూ విడుదల అవుతూ ఉంటుంది. ఇండస్ట్రీలో అగ్రహీరోగా, సినీ సెలెబ్రిటీ హోదాలో వెలుగొందుతున్నా అజిత్‌‌కి బైక్‌‌పై ప్రయాణాలు చేయడం (Travel on Bike) అంటే అమితమైన ఇష్టం అనే విషయం తెలిసిందే. అందుకే షూటింగ్‌ సమయంలో ఏమాత్రం గ్యాప్‌ దొరికిన బైకుపై చుట్టు పక్కల ఉండే ప్రాంతాలను పర్యటిస్తుంటారు.


గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో అజిత్‌ బైక్‌ ప్రయాణానికి సంబంధించిన ఫొటోలు తరచుగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆయన బైక్ రైడింగ్ (Bike Raiding) గురించి ఓ క్రేజీ వార్తల హల్ ‌చల్ చేస్తోంది. ఆయన 81 రోజుల్లో 7 ఖండాలు, 62 దేశాలను చుట్టేలా ఓ సుదీర్ఘ బైక్‌ జర్నీకి ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇందుకోసం ముందస్తు ఏర్పాట్లు సాగుతున్నాయి. కాగా అజిత్ తాజాగా నటించిన చిత్రం ‘తుణివు’. హెచ్. వినోద్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ సంక్రాంతికి తమిళంతోపాటు తెలుగులోనూ విడుదలకానుంది.

Updated Date - 2022-10-19T15:50:14+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!