Vijay Beast సినిమా లాస్ట్ సీన్‌పై నెట్టింట విపరీతమైన ట్రోలింగ్.. ఓ విశ్రాంత IAF Pilot చేసిన ట్వీట్‌తో..
ABN , First Publish Date - 2022-05-17T19:00:56+05:30 IST
దళపతి విజయ్, పూజా హెడ్గే ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ యాక్షన్ చిత్రం ‘బీస్ట్’. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం..

దళపతి విజయ్, పూజా హెడ్గే ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ యాక్షన్ చిత్రం ‘బీస్ట్’. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 13న విడుదలైన డివైడ్ టాక్ తెచ్చుకుంది. దీంతో నెల తిరక్కముందే మే 11న హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ, తమిళం భాషల్లో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఓటీటీలో మాత్రం మంచి వ్యూయర్షిప్నే సాధించింది. అయితే.. ఈ మూవీ క్లైమాక్స్ సీన్‌పై పలువురు నెటిజన్లు ట్రోలింగ్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు.
ఆ సీన్లో హీరో ప్లైట్‌ని కూలగొట్టడానికి ప్రత్యర్థులు మిసైల్స్‌ని ప్రయోగిస్తారు. వాటిని హీరో తరుఫు టీమ్ సైతం మిసైల్స్‌ని ఉపయోగించి ప్రత్యర్థుల మిసైల్స్‌ని పేల్చి పడేస్తుంది. ఈ సీక్వెన్స్ రియాలిటీకి విరుద్ధంగా ఉంది. దీంతో ఈ సీన్‌కి సంబంధించిన వీడియోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో రిటైరయిన గ్రూప్ కెప్టెన్ శివరామన్ సజన్ ట్విటర్ ఓ పోస్ట్ చేశారు. దానికి.. ‘ఈ సీన్‌పై నాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి’ అంటూ రాసుకొచ్చారు. ఓ విశ్రాంత IAF పైలట్ ఈ సీన్ ప్రామాణికతను ప్రశ్నించడంతో విజయ్ సినిమాపై నెట్టింట ట్రోలింగ్ ప్రారంభమైంది. దీనికి మరో సోల్జర్ మేజర్ అమిత్ బన్సాల్ సజన్.. ‘ఏంటి ఇది?.. నా మెదడు మొద్దుబారిపోయింది.. ఇంతకు మించి ఆలోచించలేను.. అసలు లాజిక్ లేదు’ అంటూ ట్వీట్ చేశారు. ఒక ట్విటర్ వినియోగదారు వీడియోను మళ్లీ షేర్ చేసి.. ‘బిగిల్ తర్వాత బీస్ట్‌తో పేరు, కీర్తిని విజయ్ పాడుచేసుకున్నాడు’ అని రాసుకొచ్చాడు. మరొకరు సైతం ‘ఇలాంటి సీన్లపై విజయ్ మరి కొంచెం దృష్టి పెడితే బావుంటుంది’ అంటూ ట్వీట్ చేశాడు.