మూడేళ్ల క్రితమే విడాకులు.. మాజీ భార్య కొత్త ప్రేమాయణంపై స్పందించమంటూ అడిగితే ఆ నటుడి రెస్పాన్స్ ఇదీ..!

ABN , First Publish Date - 2022-06-01T16:56:13+05:30 IST

ఎక్కడైనా ప్రేమలు, పెళ్లిలు, బ్రేకప్‌లు సాధారణంగా జరిగేవే. సినీ పరిశ్రమలో అయితే ఈలాంటి విషయాలు సర్వసాధారణం...

మూడేళ్ల క్రితమే విడాకులు.. మాజీ భార్య కొత్త ప్రేమాయణంపై స్పందించమంటూ అడిగితే ఆ నటుడి రెస్పాన్స్ ఇదీ..!

ఎక్కడైనా ప్రేమలు, పెళ్లిలు, బ్రేకప్‌లు సాధారణంగా జరిగేవే. సినీ పరిశ్రమలో అయితే ఈలాంటి విషయాలు సర్వసాధారణం. అయితే విడిపోయిన తర్వాత చాలామంది సెలబ్రిటీలు తమ మాజీల గురించి పట్టించుకోరు. వాళ్ల గురించి బయట అసలు మాట్లాడరు. అలాంటి సందర్భంలో ఎవరైనా తమ మాజీల లైఫ్ గురించి స్పందించమని అడిగితే వాళ్ల పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుంది. తాజాగా ప్రముఖ తమిళ నటుడు బాలా (Bala) అటువంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు.


తమిళ మూవీ ‘వీరమ్ (Veeram)’ ఫేమ్ బాలా, గాయని అమృత సురేష్‌ను వివాహం చేసుకున్నారు. ఈ జంటకి అవంతిక అనే కూతురు ఉంది. అనంతరం వివిధ కారణాల వల్ల మూడేళ్లపాటు విడివిడిగా జీవించిన ఈ కపుల్ 2019లో విడాకులు తీసుకున్నారు. అనంతరం బాలా, మరో మహిళ డాక్టర్ ఎలిజబెత్‌ను వివాహం చేసుకున్నాడు. కాగా.. మరోవైపు అమృత సురేష్ ప్రస్తుతం రెండు సార్లు పెళ్లి చేసుకుని, విడాకులు తీసుకున్న ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ గోపీ సుందర్‌తో డేటింగ్ చేస్తోంది. ఇటీవలే ప్రియడు గోపీతో సన్నిహితంగా ఉన్న పిక్‌ని సోషల్ మీడియాలో షేర్ చేసిన అమృత ‘మైన్’ అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది.


ఈ తరుణంలో నటుడు బాలా ఫ్యాన్స్ కోసం ఫేస్ బుక్‌లో లైవ్ ప్రొగ్రామ్ నిర్వహించాడు. పలువురు అభిమానులు రకరకాల ప్రశ్నలు అడగగా.. ఆయన సమాధానాలు తెలిపాడు. ఆ సమయంలో ‘మీ మాజీ భార్య లవ్ లైఫ్ గురించి స్పందించండి’ అని ఓ ఫ్యాన్ ఇబ్బంది పెట్టే ప్రశ్న అడిగాడు. దీనికి కొంచెం ఇబ్బంది ఫీలైన బాలా మాట్లాడుతూ..‘నేను ప్రస్తుతానికి నా భార్య ఎలిజబెత్‌తో ఎంతో హ్యాపీగా ఉన్నాను. నా మాజీ భార్య అమృత లవ్ లైఫ్ గురించి మాట్లాడడం ఇష్టం లేదు. కానీ.. ఆమె సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా’ అని చెప్పుకొచ్చాడు.

Updated Date - 2022-06-01T16:56:13+05:30 IST

Read more