సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

RRR : మీరు సినిమాలు తీయటానికి వీల్లేదు... అంటోన్న హాలీవుడ్ స్టార్!

ABN, First Publish Date - 2022-05-27T23:33:08+05:30

టాలీవుడ్ మొదలు బాలీవుడ్ దాకా ఇండియాలో అందర్నీ మెస్మరైజ్ చేసిన రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ హాలీవుడ్ లోనూ హాట్ టాపిక్ అవుతోంది. టాలెంటెడ్ నటుడు పాటన్‌ ఓస్వాల్ట్‌ తాజాగా ఆసక్తికరమైన ట్వీట్స్ చేశాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టాలీవుడ్ మొదలు బాలీవుడ్ దాకా ఇండియాలో అందర్నీ మెస్మరైజ్ చేసిన రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ హాలీవుడ్ లోనూ హాట్ టాపిక్ అవుతోంది. టాలెంటెడ్ నటుడు పాటన్‌ ఓస్వాల్ట్‌ తాజాగా ఆసక్తికరమైన ట్వీట్స్ చేశాడు. మొదట ‘ఆర్ఆర్ఆర్’ మూవీని ఐమాక్స్ తెరపై చూడమని చెప్పిన ఆయన... మీకు దగ్గర్లోని థియేటర్ లో ఎన్టీఆర్, చరణ్ మల్టీ స్టారర్ లేకపోతే నెట్ ఫ్లిక్స్ లో చూడమని సూచించాడు. తన ట్వీట్ తో పాటూ నెట్ ఫ్లిక్స్ అఫీషియల్ హ్యాండిల్ నుంచీ ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ ని కూడా ట్యాగ్ చేశాడు. 


రాజమౌళి అండ్ టీమ్ ని అభినందించేందుకు Patton Oswalt మరో ట్వీట్ కూడా చేశాడు. ‘‘అసలు మీరేం చేస్తున్నారో మీకైనా అర్థం అవుతోందా’’ అంటూ తిట్టినట్టుగా పొగిడాడు! ‘‘మిమ్మల్ని అసలు సినిమాలే తీయనీయ వద్దు’’ అంటూ ఘాటుగా మెచ్చుకున్నాడు! ‘‘మీ నుంచీ నెక్ట్స్ ఏం రాబోతోందా అనే ఉత్సుకతని... నేను తట్టుకోలేకపోతున్నాను’’ అని కూడా ఆయన అంటున్నాడు!    


పాటన్ ఓస్వాల్ట్ అమెరికాలో పాప్యులర్ స్టాండప్ కమెడియన్. అంతే కాదు, పలు టెలివిజన్ షోస్ ద్వారా యూఎస్ లో ఆయన పేరు ఇంటింటికి చేరిపోయింది. పెద్ద తెరపై కూడా పలు హాలీవుడ్ చిత్రాల్లో తన నటన, డబ్బింగ్ తో ఆకట్టుకున్నాడు. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లోనూ ఆయన కనిపించాడు. ఎమ్మీ, గ్రామీ అవార్డ్స్ అందుకున్న పాటన్ ఓస్వాల్ట్ ‘ఆర్ఆర్ఆర్’ని ఆకాశానికి ఎత్తేటం రాజమౌళి, ఆయన టీమ్ మాత్రమే కాదు... ఇండియన్స్ అంతా కూడా గర్వించదగ్గ విషయం! జక్కన తీర్చిదిద్దిన ఎపిక్ పాట్రియాటిక్ యాక్షన్ థ్రిల్లర్ ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టిన సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం చెర్రీ, తారక్, ఆలియా స్టారర్ ఓటీటీల్లో సందడి చేస్తోంది... 

Updated Date - 2022-05-27T23:33:08+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!