సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న సూర్య హీరోయిన్

ABN , First Publish Date - 2022-03-27T22:27:37+05:30 IST

విలక్షణ దర్శకుడు బాలా తెరకెక్కించిన ‘శివపుత్రుడు’ సినిమాతో

సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న సూర్య హీరోయిన్

విలక్షణ దర్శకుడు బాలా తెరకెక్కించిన ‘శివపుత్రుడు’ సినిమాలో నటించి ప్రేక్షకుల మదిని దోచిన అందాల భామ లైలా. ఆ మూవీలో సూర్య సరసన హీరోయిన్‌గా కనిపించి అభిమానులను అలరించింది. ‘ఎగిరే పావురమా’, ‘పవిత్ర ప్రేమ’,  ‘మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి’ వంటి చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైంది. తాజాగా ఆమె సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. 


చాలా కాలం క్రితమే లైలా సినిమాలకు గుడ్ బై చెప్పింది. అనంతరం ఇరానీయన్ బిజినెస్‌మ్యాన్ అయిన మెహదీన్‌ను వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరూ పిల్లలు కూడా ఉన్నారు. 16ఏళ్ల అనంతరం మళ్లీ ఆమె తమిళ సినిమాల్లో నటించనుంది. కార్తి హీరోగా తెరకెక్కుతున్న ‘సర్దార్’ చిత్రం ద్వారా వెండితెర పైకి రంగప్రవేశం చేయనుంది. ‘సర్దార్’ను పిఎస్. మిత్రన్ తెరకెక్కిస్తున్నాడు. ప్రిన్స్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తుంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. జార్జ్.సి.విలియమ్స్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. ఈ చిత్రం‌‌లో రాశీ ఖన్నా, రాజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Updated Date - 2022-03-27T22:27:37+05:30 IST