సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Rajinikanth: సూపర్‌స్టార్‌ని అవార్డుతో సత్కరించిన ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్

ABN, First Publish Date - 2022-07-25T19:05:43+05:30

సూపర్‌స్టార్ రజనీకాంత్.. ఈ పేరు తెలియని సినీ లవర్ ఉండడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ తమిళ స్టార్‌కి దేశవ్యాప్తంగానే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth).. ఈ పేరు తెలియని సినీ లవర్ ఉండడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ తమిళ స్టార్‌కి దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో అభిమానులు ఉన్నారు. అలాగే.. ఈయన నటనకి ఎన్నో అవార్డులు సైతం వరించాయి. తాజాగా సైతం ఈ లెంజెడరీ నటుడికి ఓ అవార్డు వచ్చింది. అయితే అది నటనకి కాదు.. సరైన సమయంలో అత్యధికంగా ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టినందుకు ఇచ్చారు.


తాజాగా ఇన్‌కమ్‌ ట్యాక్స్ దినోత్సవాన్ని (Income Tax Day) చెన్నైలో నిర్వహించారు. క్రమం తప్పకుండా ఆదాయపు పన్ను చెల్లిస్తుండడంతో ఆదాయపు పన్ను శాఖ రజనీకాంత్‌ని ఓ అవార్డుతో సత్కరించింది. ఈ అవార్డుని తెలంగాణ గవర్నర్ తమిళి సై చేతుల మీదుగా రజనీ తరుఫున ఆయన కూతురు ఐశ్వర్యా రజనీకాంత్ (Aishwaryaa Rajinikanth) అందుకున్నారు. దానికి సంబంధించిన ఫొటోలని ఐశ్వర్య సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ పోస్ట్‌కి.. ‘అధిక, సత్వర పన్ను చెల్లింపుదారునిగా గుర్తింపు పొందిన ట్యాక్స్ పేయర్ కూతురిగా గర్వపడుతున్నా. ఇన్‌కమ్ ట్యాక్స్ రోజున అప్పా(నాన్న)ను గౌరవించినందుకు తమిళనాడు, పుదుచ్చేరిలోని ఆదాయపన్ను శాఖకు కృతజ్ఞతలు’ అని రాసుకొచ్చారు.


ఐశ్వర్య ఈ వార్తను షేర్ చేసిన వెంటనే, అభిమానులు రజనీకాంత్‌పై అభినందనలు కురిపించారు. ‘తలైవర్ అభిమానిగా గర్విస్తున్నా’ కొందరు.. ‘తలైవర్‌కి అభినందనలు. రజనీకాంత్ సార్ తప్పకుండా బాధ్యతగల పౌరులు’ అని మరి కొందరు కామెంట్స్ చేశారు. కాగా.. రజనీకాంత్ ప్రస్తుతం డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో ‘జైలర్’ అనే సినిమాలో నటిస్తున్నారు.



Updated Date - 2022-07-25T19:05:43+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!