Sunny leone : ఆకట్టుకుంటోన్న‘ఓ మై ఘోస్ట్‌’ ఫస్ట్‌ లుక్‌

ABN , First Publish Date - 2022-04-08T19:45:44+05:30 IST

పదేళ్ళక్రితం ‘జిస్మ్ 2’ చిత్రంతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది క్రేజీ బ్యూటీ సన్నిలియోన్. తొలి ప్రయత్నంలోనే సూపర్ హిట్ సొంతం చేసుకున్న ఆమె.. వరుస అవకాశాలతో దూసుకుపోయింది. ఇండో కెనడియన్ అయినప్పటికీ.. ఆమెను బాలీవుడ్ జనం ఓన్ చేసుకోవడంతో అక్కడ క్రేజీ బ్యూటీగా సత్తా చాటుకుంది. కేవలం బాలీవుడ్ తోనే సరిపెట్టకుండా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలి చిత్రాల్లో నటించి మెప్పించింది. 2019 లో ‘హెలెన్’ చిత్రం సన్ని ఆఖరుగా బాలీవుడ్ తెరపై కనిపించింది. సన్నిలియోన్ తాజాగా ఓ తమిళ సినిమాలో నటిస్తుండడం విశేషంగా మారింది. ఆ సినిమా పేరు ‘ఓ మై ఘోస్ట్’ (ఓఎంజీ).

Sunny leone : ఆకట్టుకుంటోన్న‘ఓ మై ఘోస్ట్‌’ ఫస్ట్‌ లుక్‌

పదేళ్ళక్రితం ‘జిస్మ్ 2’ చిత్రంతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది క్రేజీ బ్యూటీ సన్నిలియోన్. తొలి ప్రయత్నంలోనే సూపర్ హిట్ సొంతం చేసుకున్న ఆమె.. వరుస అవకాశాలతో దూసుకుపోయింది. ఇండో కెనడియన్ అయినప్పటికీ.. ఆమెను బాలీవుడ్ జనం ఓన్ చేసుకోవడంతో అక్కడ క్రేజీ బ్యూటీగా సత్తా చాటుకుంది. కేవలం బాలీవుడ్ తోనే సరిపెట్టకుండా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలి చిత్రాల్లో నటించి మెప్పించింది. 2019 లో ‘హెలెన్’ చిత్రం సన్ని ఆఖరుగా బాలీవుడ్ తెరపై కనిపించింది. ఈ క్రమంలో సన్నీలియోన్ తాజాగా ఓ తమిళ సినిమాలో నటిస్తుండడం విశేషంగా మారింది. ఆ సినిమా పేరు ‘ఓ మై ఘోస్ట్’ (ఓఎంజీ). 


రీసెంట్‌గా ‘ఓ మై ఘోస్ట్‌’ (ఓఎంజీ) చిత్రం ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేశారు.  వీఏయు మీడియా ఎంటర్‌టైన్మెంట్‌, వైట్‌ హార్స్‌ స్టూడియోస్‌ బ్యానర్లపై డి.వీరా శక్తి, కె.శశికుమార్‌ల సమర్పణలో ఆర్‌.యువన్‌ దర్శకత్వం వహించారు. సన్నీ లియోన్‌ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా గురించి దర్శకుడు యువన్‌ మాట్లాడుతూ, ‘ఓఎంజీ’ ఫస్ట్‌లుక్‌ మంచి స్పందన రావడం ఆశ్చర్యంగా ఉంది.  సన్నీ లియోన్‌ పాత్రకు పురాణ చరిత్ర ఉండటంతో ఆ పాత్రను ప్రత్యేకంగా డిజైన్‌ చేశాం’ అన్నారు. దర్షా గుప్తా, సతీష్‌, యోగిబాబు, మొట్టై రాజేంద్రన్‌, రవి మరియ, రమేష్‌ తిలక్‌, అర్జునన్‌ తదితరులు నటించారు.  



Updated Date - 2022-04-08T19:45:44+05:30 IST