Vijay కొత్త సినిమా స్టార్ట్.. మూడున్నరేళ్ల నాటి Rashmika Mandanna ట్వీట్ వైరల్‌.. ఇంతకీ అసలు కథేంటంటే..

ABN , First Publish Date - 2022-04-08T23:48:37+05:30 IST

అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న కథానాయిక రష్మిక మందన్న.

Vijay కొత్త సినిమా స్టార్ట్.. మూడున్నరేళ్ల నాటి Rashmika Mandanna ట్వీట్ వైరల్‌.. ఇంతకీ అసలు కథేంటంటే..

అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న కథానాయిక రష్మిక మందన్న. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న ‘దళపతి66’లో ఆమె హీరోయిన్‌గా నటించనుంది. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇళయదళపతి సరసన హీరోయిన్‌గా నటించనుండటంతో రష్మిక సంతోషంలో మునిగితేలుతోంది. వారిద్దరి జంటను వెండి తెర మీద చూడాలనుకుంటోన్న అభిమానుల కోరిక కూడా ఈ చిత్రంతో తీరనుంది. ఈ నేపథ్యంలో రష్మిక గతంలో స్టార్ హీరో విజయ్ గురించి చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ ట్వీట్‌లో ఏముందంటే..


అందాల భామ రష్మిక మందన్న 2018, నవంబర్ 27న ఈ ట్వీట్ చేసింది.  విజయ్, అట్లీ సినిమాలో తాను హీరోయిన్ పాత్రను చేయడం లేదంటూ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టింది. ‘‘విజయ్, అట్లీ సినిమాలో మీరు నటిస్తున్నారా అంటూ అనేక మంది నన్ను అడుగుతున్నారు. కానీ, ఈ చిత్రంలో నాకు అవకాశం రాలేదు. త్వరలోనే వారితో కలసి సినిమా చేసే అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను. తప్పకుండా నేను వారితో నటిస్తాను’’ అని రష్మిక మందన్న తెలిపింది. ఆ  ట్వీట్  చేసిన మూడున్నరేళ్లకు విజయ్ చిత్రంలో రష్మికకు అవకాశం లభించింది. కొన్ని రోజుల క్రితమే చెన్నైలో ‘దళపతి 66’ మూవీకి క్లాప్ కొట్టారు. ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కునుంది. దిల్ రాజు నిర్మిస్తున్నాడు. శరత్ కుమార్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. థమన్ సంగీతం అందించనున్నాడు. ఇక రష్మిక మందన్న కెరీర్ విషయానికి వస్తే.. ‘పుష్ప: ది రూల్’, ‘యానిమల్’ ప్రాజెక్టులు ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్నాయి. ‘గుడ్ బై, మిషన్ మజ్నూ’ సినిమాల షూటింగ్స్ పూర్తయ్యాయి. ఆ రెండు చిత్రాలు విడుదలైతే బాలీవుడ్‌లోనూ రష్మిక పేరు మార్మోగే అవకాశాలున్నాయి!




Updated Date - 2022-04-08T23:48:37+05:30 IST

Read more