స్టార్ డైరెక్టర్ శంకర్ తనయుడు కూడా హీరో అవుతున్నాడు
ABN , First Publish Date - 2022-01-29T00:41:56+05:30 IST
క్రియేటివ్ డైరెక్టర్ ఎస్.శంకర్ తనయుడు వెండితెర హీరోగా పరిచయం కానున్నారు. శంకర్‌కు ముగ్గురు పిల్లలు. వీరిలో పెద్ద కుమార్తె ఐశ్వర్య ఇటీవల ఎంబీబీఎస్ పూర్తి చేయగా, రెండో కుమార్తె అదితి హీరోయిన్గా హీరో కార్తి నటిస్తున్న ‘విరుమన్’ చిత్రంలో

క్రియేటివ్ డైరెక్టర్ ఎస్.శంకర్ తనయుడు వెండితెర హీరోగా పరిచయం కానున్నారు. శంకర్‌కు ముగ్గురు పిల్లలు. వీరిలో పెద్ద కుమార్తె ఐశ్వర్య ఎంబీబీఎస్ పూర్తి చేసి.. ఇటీవలే క్రికెటర్ని మ్యారేజ్ చేసుకుంది. రెండో కుమార్తె అదితి హీరోయిన్గా హీరో కార్తి నటిస్తున్న ‘విరుమన్’ చిత్రంలో పక్కా గ్రామీణ యువతి పాత్రలో నటిస్తోంది. ఈ నేపథ్యంలో శంకర్ ఏకైక కుమారుడు అర్జిత్ కూడా కథానాయకుడుగా పరిచయం కానున్నాడు. ఇప్పటికే దర్శకత్వ శాఖలో శిక్షణ పూర్తి చేసుకున్న అర్జిత్ ఇపుడు నటనలోనూ శిక్షణ తీసుకుంటున్నారు. 2004లో శంకర్ నిర్మాతగా బాలాజీ శక్తివేల్ దర్శకత్వం వహించిన ‘కాదల్’ చిత్రం రెండో భాగం (పార్ట్-2) తెరకెక్కనుంది. ఇందులో అర్జిత్ హీరోగా వెండితెరకు పరిచయంకానున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెల్లడికానుందని కోలీవుడ్ వర్గాల సమాచారం.