ఆరేళ్లుగా నేనో నిజాన్ని దాచానంటూ KGF 2 గురించి Srinidhi Shetty ఆసక్తికర వ్యాఖ్యలు..

ABN , First Publish Date - 2022-04-08T16:50:05+05:30 IST

కేజీఎఫ్.. దేశవ్యాప్తంగా ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం ఎంటో అందరికీ తెలిసిందే. 2018లో ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా విడుదలైన..

ఆరేళ్లుగా నేనో నిజాన్ని దాచానంటూ KGF 2 గురించి Srinidhi Shetty ఆసక్తికర వ్యాఖ్యలు..

కేజీఎఫ్.. దేశవ్యాప్తంగా ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం ఎంటో అందరికీ తెలిసిందే. 2018లో ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని అందుకుంది. అప్పటి నుంచి ఈ మూవీ సెకండ్ పార్ట్ కోసం సినీ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. యశ్, శ్రీనిధి శెట్టి జంటగా నటించిన ఈ మూవీకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించాడు. పలు వాయిదాల తర్వాత ఈ సినిమా ఏప్రిల్ 14న థియేటర్స్ విడుదలకానుంది. దీంతో ఈ చిత్ర ప్రమోషన్స్‌లో మూవీ టీం బిజీగా ఉంది. ఈ తరుణంలో జరిగిన ఓ ఇంటర్య్వూలో శ్రీనిధి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది.


మోడల్‌ నుంచి నటిగా మారిన శ్రీనిధి మొదటి సినిమా అయిన కెజీఎఫ్ సిరీస్ కోసమే దాదాపు ఆరేళ్ల సమయాన్ని కేటాయించింది. దీంతో నటి కుటుంబ సభ్యులతోపాటు సన్నిహితులు మరో సినిమాకి ఎందుకు సైన్ చేయట్లేదని, ఇలాగే ఉంటే కెరీర్ ఏమౌతుందని సలహాలు ఇచ్చారంటా. అయితే ఇటీవలే విడుదలైన కెజీఎఫ్ ఛాప్టర్ 2 ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకుంది. దీని గురించి శ్రీనిధి మాట్లాడుతూ.. ‘సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ రావడం చాలా సంతోషాన్నిచ్చింది. కరోనా కారణంగా మా సినిమా విడుదల ఆలస్యం అవుతూ వచ్చింది. విడుదలలో రెండు సంవత్సరాల ఆలస్యంతోపాటు రిలీజ్ డేట్స్‌లో మూడుసార్లు మార్పులు జరిగాయి. నిజానికి ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చే వరకు సినిమా విడుదలైందని నేను నమ్మలేను. మా ట్రైలర్ 24 గంటల్లో రికార్డులను అధిగమించినందుకు మేమంతా ఎంతో సంతోషిస్తున్నాం.


అయితే.. కేజీఎఫ్ పార్ట్ 1 కూడా పూర్తి కావడానికి 2, 3 సంవత్సరాలు పట్టింది. పార్ట్ 2 కూడా కరోనా కారణంగా డిలే అవుతూ వచ్చింది, దీంతో చాలాకాలం సినిమా కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది. అయితే నేను ఇప్పటి వరకూ మరే చిత్రానికి సంతకం చేయకుండా ఈ మూవీనే అంటిపెట్టుకుని ఉన్నాను. దాని గురించి కుటుంబ సభ్యుల నుంచి ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి.కానీ నేను వారికి ఓపిక ముఖ్యమని చెబుతూ వస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది.


అలాగే శ్రీనిధి కేజీఎఫ్‌లోని తన పాత్ర గురించి మాట్లాడుతూ.. ‘నిజానికి ఈ సినిమాలో నేను చేసిన రీనా పాత్ర ఎంతో ఆశ్చర్యం కలిగించే విధంగా ఉంటుంది. అందుకే చాలా వివరాలను బయటపెట్టకుండా దాచుకున్నాను. నా పాత్రకు అధీర (సంజయ్‌దత్) లేదా రమిక సేన్ (రవీనా టాండన్)కి ఉన్న సంబంధం ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా చేస్తుంది. అది నేను గత ఆరేళ్లుగా దాచి ఉంచిన రహస్యం. ఏప్రిల్ 14 వరకు అలా ఉండాల్సిందే. దీని గురించి నేను మా నాన్నకు కూడా చెప్పలేదు. రీనా సినిమాలోని ప్రతి ఒక్కరినీ ఎలా ప్రభావితం చేస్తుందో ప్రేక్షకులు చూస్తారు. ప్రేక్షకులు ఆమెకు, ఆమె భావోద్వేగాలకు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారని భావిస్తున్నా’ అని తెలిపింది.

Updated Date - 2022-04-08T16:50:05+05:30 IST

Read more