హీరోయిన్‌గా శృతిహాసన్ ఎంత సంపాదించిందో తెలుసా.. మొత్తం ఆస్తి ఎంతంటే..
ABN , First Publish Date - 2022-02-17T18:04:56+05:30 IST
‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాతో ఇండస్ట్రీకి అడుగుపెట్టి టాప్ హీరోయిన్ ఎదిగిన నటి శృతిహాసన్. అనంతరం టాప్ హీరోలతో సినిమాలు..

‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాతో ఇండస్ట్రీకి అడుగుపెట్టి టాప్ హీరోయిన్ ఎదిగిన నటి శృతిహాసన్. అనంతరం టాప్ హీరోలతో సినిమాలు చేసి ఈ భామ కెరీర్‌లో పీక్స్‌కి చేరింది. ఈ తరుణంలో వ్యక్తిగత కారణాలతో కొన్నేళ్లపాటు నటనకు గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీ ఇటీవలే మళ్లీ బిజీ నటిగా మారిపోయింది.
శృతిహాసన్ ఇప్పటికే పాన్ ఇండియా నటుడు ప్రభాస్‌కి జోడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ‘సలార్’లో నటిస్తోంది. అంతేకాకుండా బాలీవుడ్ సినీయర్ నటుడు మిథున్ చక్రవర్తితో కలిసి చేసిన వెబ్‌సిరీస్ ‘బెస్ట్ సెల్లర్’ ఫిబ్రవరి 18న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. ఈ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఓ కార్యక్రమంలో తను సంపాదించిన ఆస్తుల విలువతో పాటు మరికొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది.
ఆ కార్యక్రమంలో ఓ రిపోర్టర్ ‘హీరోయిన్‌గా మీరు ఇప్పటివరకూ ఎంత సంపాదించారు’ అని అడిగాడు. దానికి సమాధానంగా శృతి మాట్లాడుతూ.. ‘నేను ప్రస్తుతం నా ప్రాపర్టీస్ గురించే తెలుసుకునే పనిలోనే ఉన్నాను. వాటి విలువ ప్రస్తుతం ఉన్న దానికంటే ఎక్కువ కావాలని కోరుకుంటున్నా. నాకు తెలిసి వాటి విలువ దాదాపు ఆరు మిలియన్ డాలర్లు అంటే 45 కోట్లకు పైగా ఉండొచ్చు’ అని తెలిపింది. అయితే అంతకంటే ఎక్కువే ఉండొచ్చని ఓ అంచనా.
అంతేకాకుండా శృతి తన బోయ్‌ఫ్రెండ్ శాంతను హజారికా గురించి మాట్లాడుతూ.. ‘చాలామంది నా పర్సనల్ లైఫ్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. నా బోయ్‌ఫ్రెండ్ టాప్ డూడుల్ ఆర్టిస్ట్’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా.. వీరిద్దరూ దాదాపు ఏడాది నుంచి రిలేషన్‌షిప్‌లో ఉన్నారు.