Sivakarthikeyan: ప్రాధాన్యం ఉంటేనే మల్టీస్టారర్‌ చిత్రాలు

ABN , First Publish Date - 2022-05-12T04:51:25+05:30 IST

తమిళం లేదా తెలుగు భాషల్లో మల్టీస్టారర్‌ చిత్రాల్లో నటించేందుకు తాను సిద్ధమని అయితే.. పాత్రల్లో సమ ప్రాధాన్యత ఉండాలని హీరో శివకార్తికేయన్‌ (Sivakarthikeyan) అన్నారు. ఆయన నటించిన కొత్త చిత్రం ‘డాన్‌’ (Don) ఈ నెల 13న తమిళం, తెలుగు భాషల్లో రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా

Sivakarthikeyan: ప్రాధాన్యం ఉంటేనే మల్టీస్టారర్‌ చిత్రాలు

తమిళం లేదా తెలుగు భాషల్లో మల్టీస్టారర్‌ చిత్రాల్లో నటించేందుకు తాను సిద్ధమని అయితే.. పాత్రల్లో సమ ప్రాధాన్యత ఉండాలని హీరో శివకార్తికేయన్‌ (Sivakarthikeyan) అన్నారు. ఆయన నటించిన కొత్త చిత్రం ‘డాన్‌’ (Don) ఈ నెల 13న తమిళం, తెలుగు భాషల్లో రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో ముచ్చటించారు. 


ఆయన మాట్లాడుతూ.. 

‘‘మంచి కథలు, పాత్రల మధ్య సమ ప్రాధాన్యత ఉంటే ఖచ్చితంగా ఇతర హీరోలతో కలిసి నటించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదు. టాలీవుడ్‌ డైరెక్టర్‌ అనుదీప్‌ (Anudeep) దర్శకత్వంలో నటిస్తున్నాను.. ఈ అవకాశం నన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఇది ‘జాతిరత్నాలు’ (Jathi Ratnalu)కు సీక్వెల్‌ కాదు. ఫ్రెష్‌ స్ర్కిప్టుతో పక్కా తమిళ నేటివిటీతో తెరకెక్కిస్తున్నాం. ఆ తర్వాత నా చిత్రాలను తెలుగులోకి అనువదించినట్టుగానే తెలుగులోకి డబ్‌ చేస్తాం. తమిళ చిత్రపరిశ్రమలో నేను డాన్‌ను కాదు. ఆ స్థాయికి ఇంకా చేరుకోలేదు. ‘డాన్‌’ చిత్ర ట్రైలర్‌ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉదయనిధి (Udayanidhi) కామెడీ కోసం అలా వ్యాఖ్యానించారు. అయితే, పూర్తి కాలేజీ నేపథ్యంలో సాగే ‘డాన్‌’లో మాత్రం నన్ను ముద్దుగా డాన్‌ అని పిలుస్తారు. ప్రతి కాలేజీ విద్యార్థి చూడాల్సిన సినిమా. మంచి సందేశంతో ఉంటుంది. పైగా ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు థియేటర్‌ నుంచి బయటకు వెళ్ళేటపుడు మన జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి కదా.. అని ఫీల్‌ అవుతారు. ‘డాన్‌’ ఖచ్చితంగా సక్సెస్‌ సాధిస్తుందన్న నమ్మకం ఉంది. అయితే, ‘డాక్టర్‌’ (Doctor) తరహాలోనే రూ.100 కోట్లు వసూలు చేస్తుందా లేదా అన్నది ప్రేక్షకులు చేతుల్లోనే ఉంది’’ అని చెప్పుకొచ్చారు. కాగా ఈ చిత్రం తెలుగులో ‘కాలేజ్ డాన్’ అనే టైటిల్‌తో డబ్ అవుతోంది.



Updated Date - 2022-05-12T04:51:25+05:30 IST