సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Siva kartikeyan: 21వ చిత్రానికి ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్..!

ABN, First Publish Date - 2022-05-20T16:10:36+05:30

కోలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజ్ ఉన్న హీరోలలో శివ కార్తికేయన్ (Sivakarthikeyan) ఒకరు. హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇటీవల డాక్టర్ (Doctor) సినిమాతో వచ్చి హిట్ అందుకున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజ్ ఉన్న హీరోలలో శివ కార్తికేయన్ (Sivakarthikeyan) ఒకరు. హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇటీవల డాక్టర్ (Doctor) సినిమాతో వచ్చి హిట్ అందుకున్న శివ కార్తికేయన్ కొత్త చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకువచ్చారు. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో శివ కార్తికేయన్ తన 21 (SK 21)వ సినిమా చేస్తుండగా, యూనివర్సల్‌ యాక్టర్‌ కమల్‌హాసన్‌ (Kamal Haasan) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 


అయితే, తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ విషయంలో సోషల్ మీడియా వేదికగా మాత్రమే కాకుండా, ఫిల్మ్ సర్కిల్స్‌లోనూ న్యూస్ స్ప్రెడ్ అవుతోంది. శివ కార్తికేయన్ సినిమాకి 'మావీరన్' (Maaveeran) అనే టైటిల్‌ను అధికారికంగా ఖరారు చేసినట్లు కోలీవుడ్ మీడియా సమాచారం. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నటుడు, నిర్మాత మరియు పంపిణీదారుడు అయిన ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) సినిమా టైటిల్‌ను రివీల్ చేశారట.


కథానుసారం ఈ మూవీకి 'మావీరన్' అనే టైటిల్‌ను కన్‌ఫర్మ్ చేశారట. ఇక ఈ సినిమాలో శివకార్తికేయన్ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఇప్పటికే, దీనికి సంబంధించిన లుక్ కూడా సోషల్ మీడియాలో వచ్చింది. ఈ సినిమాలో ఫిదా బ్యూటీ సాయి పల్లవి శివ కార్తికేయన్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ మరియు సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా కలిసి భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, హారిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు.  

Updated Date - 2022-05-20T16:10:36+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!