సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

యాక్షన్‌ అవతారంలో సిల్వర్‌ జూబ్లీ హీరో..

ABN, First Publish Date - 2022-03-27T18:51:33+05:30

తమిళ చిత్రపరిశ్రమలో సిల్వర్‌ జూబ్లీ హీరోగా పేరున్న మోహన్‌ సరికొత్త పాత్రలో అలరించబోతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త చిత్రం షూటింగ్‌ తాజాగా చెన్నై నగరంలో ప్రారంభమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తమిళ చిత్రపరిశ్రమలో సిల్వర్‌ జూబ్లీ హీరోగా పేరున్న మోహన్‌ సరికొత్త పాత్రలో అలరించబోతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త చిత్రం షూటింగ్‌ తాజాగా చెన్నై నగరంలో ప్రారంభమైంది. కోయంబత్తూరు ఎస్‌.బి.మోహన్‌ రాజ్‌, జి.మీడియా జయశ్రీ విజయ్‌ సంయుక్తంగా ఈ నిర్మించే ఈ చిత్రానికి విజయ్‌ శ్రీ దర్శకత్వం వహిస్తుండగా, ‘హర’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. సినిమా తొలిరోజు షూటింగులో పోరాట సన్నివేశాలను చిత్రీకరించారు.  చెన్నై షెడ్యూల్‌ పూర్తికాగానే కోయంబత్తూరు, ఊటీలో షూటింగ్‌ జరిపేలా ప్లాన్‌ చేశారు. పాఠశాలలో చదువుకునే సమయంలోనే ఫస్ట్‌ఎయిడ్‌, గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌ వంటి విషయాలపై బాలబాలికలకు నేర్చించినట్టుగానే ఐపీసీ సెక్షన్లపై చిన్నారుల్లో అవగాహన కల్పించాలన్నదే ఈ చిత్రానికి ఎంచుకున్న ప్రధాన కథాంశం. 

Updated Date - 2022-03-27T18:51:33+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!