యాక్షన్ అవతారంలో సిల్వర్ జూబ్లీ హీరో..
ABN , First Publish Date - 2022-03-27T18:51:33+05:30 IST
తమిళ చిత్రపరిశ్రమలో సిల్వర్ జూబ్లీ హీరోగా పేరున్న మోహన్ సరికొత్త పాత్రలో అలరించబోతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ తాజాగా చెన్నై నగరంలో ప్రారంభమైంది.

తమిళ చిత్రపరిశ్రమలో సిల్వర్ జూబ్లీ హీరోగా పేరున్న మోహన్ సరికొత్త పాత్రలో అలరించబోతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ తాజాగా చెన్నై నగరంలో ప్రారంభమైంది. కోయంబత్తూరు ఎస్.బి.మోహన్ రాజ్, జి.మీడియా జయశ్రీ విజయ్ సంయుక్తంగా ఈ నిర్మించే ఈ చిత్రానికి విజయ్ శ్రీ దర్శకత్వం వహిస్తుండగా, ‘హర’ అనే టైటిల్ ఖరారు చేశారు. సినిమా తొలిరోజు షూటింగులో పోరాట సన్నివేశాలను చిత్రీకరించారు. చెన్నై షెడ్యూల్ పూర్తికాగానే కోయంబత్తూరు, ఊటీలో షూటింగ్ జరిపేలా ప్లాన్ చేశారు. పాఠశాలలో చదువుకునే సమయంలోనే ఫస్ట్‌ఎయిడ్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వంటి విషయాలపై బాలబాలికలకు నేర్చించినట్టుగానే ఐపీసీ సెక్షన్లపై చిన్నారుల్లో అవగాహన కల్పించాలన్నదే ఈ చిత్రానికి ఎంచుకున్న ప్రధాన కథాంశం.