Shashi Preetam: ప్రాథమిక దశలోనే వాటిని గుర్తించాలి

ABN , First Publish Date - 2022-11-28T18:40:40+05:30 IST

సామాజిక సేవారంగంలోనూ నేను సైతం అంటూ ముందుకు సాగుతున్న సంగీత దర్శకుడు మరియు దర్శకనిర్మాత అయిన శశి ప్రీతమ్ సారథ్యంలో...

Shashi Preetam: ప్రాథమిక దశలోనే వాటిని గుర్తించాలి

ప్రాణాంతక వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించడం చాలా అవసరం అని అన్నారు సంగీత దర్శకుడు శశి ప్రీతమ్. సామాజిక సేవారంగంలోనూ నేను సైతం అంటూ ముందుకు సాగుతున్న సంగీత దర్శకుడు మరియు దర్శకనిర్మాత అయిన శశి ప్రీతమ్ సారథ్యంలో... క్యాన్సర్, డయాబెటీస్, మానసిక ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆదివారం బైక్ అండ్ కార్ ర్యాలీ నిర్వహించారు. హైదరాబాద్, గుంటూరు, ఒంగోలు నుంచి ర్యాలీగా వచ్చిన వారంతా సూర్యాపేట, లిటిల్ విలేజ్‌లో సమావేశమయ్యారు. 


ఈ సమావేశంలో..  ప్రాణాంతక వ్యాధులను ప్రాథమిక దశలో గుర్తించాల్సిన ఆవశ్యకతను వివరించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యాధుల పట్ల నెలకొని ఉన్న అపోహలను, భయాలను పోగొట్టాల్సిన అవసరాన్ని వక్తలు ప్రస్తావించారు. శశి ప్రీతమ్‌తో పాటు సింగరాజు క్యాన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ మల్లిక్ సింగరాజు, ఆక్రో మెంటల్ హెల్త్ సర్వీసెస్ స్థాపకురాలు - సైకాలజిస్ట్ డాక్టర్ ఐశ్వర్యా కృష్ణప్రియ, మలినేని విద్యాసంస్థల అధినేత డాక్టర్ పెరుమాళ్, సూర్యాపేట "డి.ఎస్.పి" పి.నాగభూషణం, బిగ్ బాస్ ఫేమ్ శ్వేతవర్మ, రొటేరియన్ స్వప్న, నిర్మాత దుష్యంత్ రెడ్డితోపాటు పలువురు వైద్యరంగ నిష్ణాతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Updated Date - 2022-11-28T18:40:40+05:30 IST

Read more