హీరోగా శరత్ కుమార్ రిటర్న్స్

ABN , First Publish Date - 2022-03-27T17:57:51+05:30 IST

కప్పుడు కోలీవుడ్ లో యాక్షన్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు శరత్ కుమార్. ఆయన నటించిన పలు చిత్రాలు తెలుగులో రీమేక్ అయ్యాయి. అలాగే.. మరికొన్ని చిత్రాలు తెలుగులో డబ్ అయ్యాయి. కొంత కాలంగా శరత్ కుమార్ హీరో వేషాలు తగ్గించి.. కేరక్టర్ ఆర్టిస్ట్ గానూ, ప్రధాన పాత్రల్లోనూ నటిస్తూ వస్తున్నారు. అయితే ఆయన ఇప్పుడు మళ్ళీ హీరోగా రిటర్న్ కానుండడం విశేషంగా మారింది. ఆయన సుధీర్ఘకాలం తర్వాత హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఎన్‌కౌంటర్‌’.

హీరోగా శరత్ కుమార్ రిటర్న్స్

ఒకప్పుడు కోలీవుడ్ లో యాక్షన్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు శరత్ కుమార్. ఆయన నటించిన పలు చిత్రాలు తెలుగులో రీమేక్ అయ్యాయి. అలాగే.. మరికొన్ని చిత్రాలు తెలుగులో డబ్ అయ్యాయి. కొంత కాలంగా శరత్ కుమార్ హీరో వేషాలు తగ్గించి.. కేరక్టర్ ఆర్టిస్ట్ గానూ, ప్రధాన పాత్రల్లోనూ నటిస్తూ వస్తున్నారు. అయితే ఆయన ఇప్పుడు మళ్ళీ హీరోగా రిటర్న్ కానుండడం విశేషంగా మారింది. ఆయన సుధీర్ఘకాలం తర్వాత హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఎన్‌కౌంటర్‌’. 


చెన్నై, వేళచ్చేరిలో జరిగిన ఘటనను ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కించారు. ఎస్‌.టి.వేందన్‌ కథ సమకూర్చి దర్శకత్వం వహించారు. యువనటి ఇనియా హీరోయిన్‌గా నటించగా, ఇమ్మాన్‌ అన్నాచ్చి, బ్లాక్‌ పాండి, నిళల్‌గల్‌ రవి తదితర నటీనటులు ఇతర పాత్రలను పోషించారు. ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను తాజాగా రిలీజ్‌ చేశారు. ఇందులో శరత్‌ కుమార్‌ తుపాకీ  పట్టుకుని ఫోజిచ్చారు. ఈ చిత్రం టైటిల్‌ ఎన్‌కౌంటర్‌ అక్షరాలు కూడా తుపాకీ ఆకారంలోనే డిజైన్‌ చేశారు. ఇందులో ‘ఎన్‌కౌంటర్‌ అట్‌ 152 బ్లాక్‌’ అనే ఉపశీర్షిక చేర్చారు. అచ్చు రాజామణి సంగీతం. వీఆర్‌ మూవీస్‌ పతాకంపై రాజేశ్వరి వేందన్‌ సమర్పణలో నిర్మాత టి.రాజేశ్వరి నిర్మించారు. 



Updated Date - 2022-03-27T17:57:51+05:30 IST