సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

సీనియర్‌ నటి మాళవిక రీఎంట్రీ ఈ చిత్రంతోనే!

ABN, First Publish Date - 2022-04-06T03:08:49+05:30

ఇందులో మంగమ్మ అనే పాత్ర పోషిస్తుండగా ఈమెకు జోడీగా డైరెక్టర్‌ మనోబాలా నటిస్తున్నారు. హీరోలు జీవా, జై, శ్రీకాంత్‌ నటిస్తున్న ఈ సినిమాలో అమృత అయ్యర్‌, రైజా విల్సన్‌, ఐశ్వర్య దత్తా హీరోయిన్లు. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్‌లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సుందర్‌.సి దర్శకత్వంలో సీనియర్‌ నటి మాళవిక రీఎంట్రీ ఇస్తూ తద్వారా కోలీవుడ్‌లో తన సెకండ్‌ ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుట్టింది. 1999లో సుందర్‌.సి దర్శకత్వంలో అజిత్‌ హీరోగా ‘ఉన్నై తేడి’ ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన మాళవిక ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. 2007లో సురేష్‌ మేనన్‌ అనే వ్యక్తిని పెళ్ళి చేసుకుని వైవాహిక జీవితానికే పరిమితమైంది. ఇపుడు సుందర్‌ దర్శకత్వంలో మళ్ళీ రీఎంట్రీ ఇస్తోంది. ఇందులో మంగమ్మ అనే పాత్ర పోషిస్తుండగా ఈమెకు జోడీగా డైరెక్టర్‌ మనోబాలా నటిస్తున్నారు. హీరోలు జీవా, జై, శ్రీకాంత్‌ నటిస్తున్న ఈ సినిమాలో అమృత అయ్యర్‌, రైజా విల్సన్‌, ఐశ్వర్య దత్తా హీరోయిన్లు. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్‌లో మాళవిక పాల్గొన్న ఫొటోలను చిత్ర బృందం రిలీజ్‌ చేసింది. ఇంకా పేరు పెట్టని ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.



Updated Date - 2022-04-06T03:08:49+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!