సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

సీనియర్ నటి ఖుష్భూకు కరోనా

ABN, First Publish Date - 2022-01-11T00:48:26+05:30

సెలబ్రిటీలను కరోనా వైరస్ వెంటడుతూనే ఉంది. సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు ఒకరి తర్వాత మరొకరు కోవిడ్ బారిన పడుతున్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సెలబ్రిటీలను కరోనా వైరస్ వెంటడుతూనే ఉంది. సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు ఒకరి తర్వాత మరొకరు కోవిడ్ బారిన పడుతున్నారు. కమల్ హాసన్, విక్రమ్, నోరా ఫతేహీ తదితరులందరు కరోనా బారిన పడ్డారు. నటి శోభన కూడా ఒమైక్రాన్ బారిన పడింది.  తాజాగా  మరో సీనియర్ నటి ఖుష్భూకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. 


ఖుష్భూ సోషల్ మీడియాలో ఒక మెసేజ్‌ను అభిమానులతో పంచుకుంది. ‘‘ గత 2కరోనా వేవ్‌ల నుంచి నేను తప్పించుకున్నాను. అయినప్పటికి ఈ సారి నాకు కరోనా సోకింది. నిన్నటి వరకు నాకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవు. ముక్క నుంచి కారడం అధికం కాగానే పరీక్ష చేయించుకున్నాను. అప్పుడే కరోనా అని నాకు తెలిసింది. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నాను. ఒంటరిగా ఉండటం నాకు ఇష్టం ఉండదు. అందువల్ల 5రోజుల వరకు నన్ను ఎంటర్ టైన్ చేయండి ’’ అని ఖుష్భూ ట్వీట్ చేసింది.



Updated Date - 2022-01-11T00:48:26+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!