Selvaraghavan: నన్ను బలవంతం చేసి.. ఆ క్యారెక్టర్ చేయించారు

ABN , First Publish Date - 2022-05-23T15:14:53+05:30 IST

నటుడిగా మంచి ఫామ్‌లో ఉన్న దర్శకుడు సెల్వరాఘవన్. కిర్తీ సురేశ్‌తో కలిసి ఆయన లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘సాని కాయిదమ్’.

Selvaraghavan: నన్ను బలవంతం చేసి.. ఆ క్యారెక్టర్ చేయించారు

నటుడిగా మంచి ఫామ్‌లో ఉన్న దర్శకుడు సెల్వరాఘవన్. కిర్తీ సురేశ్‌తో కలిసి ఆయన లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘సాని కాయిదమ్’. ఇదే సినిమా తెలుగులో ‘చిన్ని’ విడుదలైంది. డైరెక్ట్‌గా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయ్యి మంచి టాక్‌ని సొంతం చేసుకుంది. అంతేకాకుండా నటనలో ఈయనికి మంచి పేరునే సంపాదించి పెట్టింది. దీంతో మరికొన్ని సినిమాల్లో ఈయన ముఖ్య పాత్రలు చేస్తున్నాడు. కాగా.. ధనుష్ హీరోగా ‘నానే వరువెన్’ సినిమాకి రాఘవన్ దర్శకత్వం వహిస్తున్నాడు. అంతేకాకుండా ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో కూడా నటిస్తున్నాడు. ఆ క్యారెక్టర్ గురించి ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.


ఈ సినిమాలో ధనుష్ (Dhanush) ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ సినిమా గురించి రాఘవన్ మాట్లాడుతూ.. ‘ఎవరూ ఊహించని విధంగా సినిమా ఉంటుంది. మీరు అనుకోనిది జరుగుతుందని చెప్పగలను. ప్రేక్షకులకి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. అయితే ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్ర చేయాల్సిన నటుడు చివరి నిమిషంలో రాలేదు. దీంతో యూనిట్ మొత్తం ఆ క్యారెక్టర్ చేయమని బలవంతం చేశారు. ఎందుకంటే మరుసటి రోజు ఉదయం నుంచే షూటింగ్ జరగాలి. అందుకే ఎటువంటి ముందస్తు ప్రణాళిక లేకుండా ఇందులో పాత్ర చేశాను’ అని చెప్పుకొచ్చాడు.

Updated Date - 2022-05-23T15:14:53+05:30 IST