తాను చెప్పినట్టు చేయకపోతే ‘అవార్డ్స్’ని మంటల్లో కరిగించేస్తానంటోన్న టాలెంటెడ్ యాక్టర్!

ABN , First Publish Date - 2022-03-27T21:17:27+05:30 IST

ఉక్రెయిన్, రష్యా యుద్ధం అమెరికాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అగ్ర రాజ్యంలో జో బైడెన్ మొదలు ప్రముఖులంతా రష్యా దండయాత్రపై ఏదో ఒక విధంగా కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. హాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఉక్రెయిన్‌కు బలంగా మద్దతు తెలుపుతున్నారు. అకాడమీ అవార్డ్ విన్నర్ సీన్ పెన్ తాజాగా పుతిన్‌కు వ్యతిరేకంగా, జెలెన్‌స్కీకి మద్దతుగా గళమెత్తాడు...

తాను చెప్పినట్టు చేయకపోతే ‘అవార్డ్స్’ని మంటల్లో కరిగించేస్తానంటోన్న టాలెంటెడ్ యాక్టర్!

ఉక్రెయిన్, రష్యా యుద్ధం అమెరికాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అగ్ర రాజ్యంలో జో బైడెన్ మొదలు ప్రముఖులంతా రష్యా దండయాత్రపై ఏదో ఒక విధంగా కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. హాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఉక్రెయిన్‌కు బలంగా మద్దతు తెలుపుతున్నారు. అకాడమీ అవార్డ్ విన్నర్ సీన్ పెన్ తాజాగా పుతిన్‌కు వ్యతిరేకంగా, జెలెన్‌స్కీకి మద్దతుగా గళమెత్తాడు. 


ఏటా ఆస్కార్ అవార్డులు ప్రదానం చేసే ‘అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’కు సీన్ పెన్ అల్టిమేటమ్ జారీ చేశాడు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కోసం ఎంత దాకా అయినా వెళతానని అంటున్నాడు. ‘మిస్టిక్ రివర్, మిల్క్’ సినిమాలకిగాను గతంలో ఆస్కార్స్ అందుకున్న ఆయన తన ట్రోఫిల్ని పబ్లిక్‌లో కరిగించేస్తానని హెచ్చరించాడు. రష్యా దౌర్జ్యన్యానికి ఎదురు తిరిగి పోరాడుతోన్న ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీని ఆస్కార్స్ వేడుకలో భాగం చేయాలన్నదే ఆయన డిమాండ్. ప్రతిష్ఠాత్మక పురస్కారాల ప్రదానోత్సవంలో అతడి చేత మాట్లాడించాలని పట్టుబడుతున్నాడు సీన్ పెన్. 


కొద్ది రోజుల క్రితమే ఉక్రెయిన్ దేశాధ్యక్షుడ్ని ప్రత్యక్షంగా కలుసుకున్నాడు హాలీవుడ్ స్టార్ సీన్ పెన్. రష్యా బీకర దాడుల నేపథ్యంలో ఓ డాక్యుమెంటరీ రూపొందిస్తున్నాడాయన. జెలెన్‌స్కీతో కలసి మీడియాతో కూడా మాట్లాడిన పెన్ పుతిన్ తీరుని తప్పుబట్టాడు. ఉక్రెయిన్‌కి మద్దతు పలికాడు. తాజాగా ఇప్పుడు ఆస్కార్స్ నిర్వాహకుల్ని కూడా హెచ్చరించాడు. అకాడమీ అవార్డ్స్ వేదికపై నుంచీ జెలెన్‌స్కీ చేత రష్యాకు వ్యతిరేకంగా మాట్లాడించాలని అంటున్నాడు. తానే కాదు ఇతర అతిథులు, ప్రేక్షకులు కూడా ఆస్కార్స్‌ని బహిష్కరించాలంటూ సీన్ పెన్ అభిప్రాయపడుతున్నాడు. చూడాలి మరి, మార్చ్ 28న జరగబోయే హాలీవుడ్స్ మోస్ట్ అవెయిటెడ్ అవార్డ్స్ సెరిమనీ ఎలా జరుగుతుందో... 

Updated Date - 2022-03-27T21:17:27+05:30 IST