ఆ పాత్రలో నటించడం ఓ వరం : ‘కట్టప్ప’ సత్యరాజ్‌

ABN , First Publish Date - 2022-12-02T15:17:03+05:30 IST

‘ఒన్బదు రూపాయి నోటు’ (umbadu rupayi notu) చిత్రంలో ప్రధాన పాత్ర పోషించే భాగ్యం తనకు దక్కడం ఓ వరమని సీనియర్‌ నటుడు, ‘కట్టప్ప’ సత్యరాజ్ అన్నారు.

ఆ పాత్రలో నటించడం ఓ వరం : ‘కట్టప్ప’ సత్యరాజ్‌

‘ఒన్బదు రూపాయి నోటు’ (umbadu rupayi notu) చిత్రంలో ప్రధాన పాత్ర పోషించే భాగ్యం తనకు దక్కడం ఓ వరమని సీనియర్‌ నటుడు, ‘కట్టప్ప’ సత్యరాజ్ (Sathyaraj) అన్నారు. ఆ పాత్రలో నటించలేదని, జీవించానని సత్యరాజ్‌ అన్నారు. దర్శకుడు తంగర్‌ బచ్చన్‌ తెరకెక్కించిన ఈ చిత్రం విడుదలై 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తన పాత్ర గురించి సత్యరాజ్‌ వివరిస్తూ.. ‘ఒన్బదు రూపాయి నోటు’ చిత్రం విడుదలై 15 ఏళ్లు పూర్తి చేసుకుంది.


ఇందులో మాధవ పడైయాచ్చి అనే పాత్రలో నేను నటించలేదని, జీవించినట్టు కామెంట్స్‌ చేస్తున్నారు. నిజానికి ఆ పాత్ర అలా రావడానికి కారణం డైరెక్టర్‌ తంగర్‌ బచ్చన్‌.  ఆయనలో అంతర్లీనంగా దాగి ఉన్న కథను స్ర్కిప్టుగా మలిచారు. ఇది మన నేల (మట్టి) కథ. మన కళ్లు ముందు జరిగేది చెబుతున్నట్టుగా ఉంటుంది. ఈ సినిమా చూసిన వారికి సినిమా చూశామనే ఫీలింగ్‌ ఉండదు. వైరముత్తు సాహిత్యానికి భరద్వాజ్‌ అద్భుతమైన సంగీతం సమకూర్చారు. సహ నటీనటులు అర్చన, నాజర్‌, రోహిణి ఇలా అందరూ వారివారి పాత్రల్లో జీవించారు. అందుకే ఈ చిత్రం అంతటి ఘన విజయం సాధించింది’ అని సత్యరాజ్‌ తన పాత జ్ఞాపకాలని గుర్తు చేసుకున్నారు.

Updated Date - 2022-12-02T15:17:03+05:30 IST